Telangana Tourism : షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ

ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970గా నిర్ణయించారు.

Telangana Tourism : షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ

Telangana Tourism

Updated On : April 27, 2023 / 8:47 AM IST

Telangana Tourism : మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆలయం షిర్డీకి హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. షిర్డీలో సాయిబాబాను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే షిర్డీ వెళ్లే భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లే భక్తుల కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.  ఏసీ, నాన్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970గా నిర్ణయించారు. అలాగే, హోటల్ రూమ్ ను కూడా తెలంగాణ టూరిజం సమకూర్చనుంది. కాగా, దర్శనం టికెట్లు, ఆహారం ఫీజు మాత్రం ప్యాకేజీలో భాగం కాదు.

Shirdi Saibaba Temple : షిర్డికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న టూరిజం శాఖ

ప్రత్యేక ప్యాకేజీతో హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లాలనుకునే భక్తులను సాయంత్రం సమయాల్లో హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, బషీర్ బాగ్, ప్యారడైస్, బేగంపేట్, కేపీహెచ్ బీ, మియాపూర్ ప్రాంతాల్లో తెలంగాణ టూరిజం బస్సులు పికప్ చేసుకోనున్నాయి.  మరుసటి రోజు ఉదయం 7 గంటలకు టూరిజం బస్సులు షిర్డీ చేరుకుంటాయి. హోటల్ గదిలో భక్తులు ఫ్రెషప్ అయిన వెంటనే అదే బస్సుల్లో దర్శనానికి తీసుకెళ్తారు. దర్శనం అనంతరం షిర్డీ సమీపంలోని ఆలయాలకు భక్తులను తీసుకెళ్లనున్నారు.

అనంతరం అదే రోజు సాయంత్రం 4గంటలకు షిర్డీ నుంచి హైదరాబాద్ కు బస్సులు తిరిగి బయల్దేరుతాయి. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ కు టూరిజం బస్సులు చేరుకోనున్నాయి. మరిన్ని వివరాల కోసం https://tourism.telangana.gov.in/package/shirdiTour ఈ వెబ్ సైట్ ను లాగిన్ కావొచ్చు.