Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఆట మొదలుకాబోతోంది, బీజేపీలోకి ఎందుకు వెళ్ల లేదంటే- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy : తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది.

Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఆట మొదలుకాబోతోంది, బీజేపీలోకి ఎందుకు వెళ్ల లేదంటే- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy – Rahul Gandhi : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అరికెల నర్సారెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఖమ్మం జిల్లా పొంగులేటి అనుచరులు స్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులని కలవనున్నారు పొంగులేటి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా తెలంగాణకి చెందిన నాలుగైదు జిల్లాల కాంగ్రెస్ నేతలు పార్టీ పెద్దలను కలవనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసిన తర్వాత మీడియా సమావేశం ఉంటుందని పొంగులేటి తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ఆయన చెప్పారు.

Also Read.. Bandi Sanjay: తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదు.. ప్రజలు అనుకోవాలి

తెలంగాణలో ఆట మొదలు కాబోతోందని, ఆటను పర్ఫెక్ట్ గా ఆడబోతున్నామని పొంగులేటి అన్నారు. ఇక, బీజేపీ వైపు ఎందుకు వెళ్లలేదో మీడియా సమావేశంలో వివరంగా వెల్లడిస్తా అన్నారు. ఖమ్మంలోనే నా చేరిక ఉంటుంది, నా క్యాడర్ అంతా నా వెంటే ఉంది అని పొంగులేటి చెప్పారు. భవిష్యత్తులో ఇతర పార్టీల నేతలు, ఇతర ప్రాంతాల నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు అని ఆయన జోస్యం చెప్పారు.

Also Read.. Revanth Reddy : కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు : రేవంత్ రెడ్డి

” రేణుకా చౌదరిని కూడా కలుస్తా. అందరినీ కలుస్తా. బీజేపీ వైపు ఎందుకు వెళ్ళలేదో రేపు మీడియా సమావేశంలో వివరంగా వెల్లడిస్తా. గడిచిన 6 నెలల్లో ఏం చేశామనేది కూడా రేపు వెల్లడిస్తా. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది.
బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఏనాడూ పదవులను ఆశించ లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా పదవులు ఆశించడం లేదు” అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.