World Cup 2023: భారత్‌లో ఆ రెండు స్టేడియాల్లోనే పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లు ఆడుతుండట.. ఉప్పల్ స్టేడియంకు మహర్దశ..!

ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచ కప్ -2023 కు ముందు భారత్‌లోని ఐదు ప్రధాన స్టేడియాల ఆధునికీకరణకు బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. ఈ ఐదు స్టేడియంలను ఆధునికీకరించేందుకు బీసీసీఐ రూ. 500 కోట్లు ఖర్చు చేయనుంది.

World Cup 2023: భారత్‌లో ఆ రెండు స్టేడియాల్లోనే పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లు ఆడుతుండట.. ఉప్పల్ స్టేడియంకు మహర్దశ..!

India Vs Pakistan Teams

World Cup 2023: వన్డే వరల్డ్ కప్ -2023 (World Cup 2023)  మెగా టోర్నీ ఈ ఏడాది చివరిలో భారత్‌ (India) లో జరుగుతుంది. అక్టోబర్ 5న ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 45 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందుకోసం ఇండియాలోని పన్నెండు నగరాల్లోని స్టేడియాలను బీసీసీఐ (BCCI) ఎంపిక చేసింది. వాటిలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై, అహ్మదాబాద్ లోని స్టేడియంలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి.

World Cup 2023: మీరలా అయితే.. మేమిలా! బీసీసీఐకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు..

వరల్డ్ కప్ -2023 మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు తొలుత ఒప్పుకోలేదు. దీనికి కారణం.. త్వరలో పాకిస్థాన్‌ (Pakistan) లో ఆసియా కప్ (Asia Cup 2023) జరుగుతుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌లో భారత్ జట్టు మ్యాచ్‌లు ఆడబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. చివరకు.. పాకిస్థాన్ వెలుపల ఇతర దేశాల్లో భారత్ మ్యాచ్‌లు ఆడేలా ఒప్పుకోవటం, అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకారం తెలపడంతో సమస్య సర్దుమణిగింది. ఈ విషయంపై పీసీబీ అధిపతి నజమ్ సేథి స్పందిస్తూ.. ఈ ఏడాది ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌లో భారత్ జట్టు మ్యాచ్‌లు ఆడేందుకు తిరస్కరిస్తే తాము 30లక్షల డాలర్లు నష్టపోతామని అన్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ భారత్ తన మ్యాచ్‌లను మరో దేశంలో ఆడొచ్చని ప్రతిపాదించింది. అలా చేస్తే మేం ఆతిధ్య హక్కులు కోల్పోమని అన్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆదాయంలో 80శాతం భారత్, పాకిస్థాన్ ఆడే మ్యాచ్ ల నుంచే వస్తాయని సేథి అన్నారు.

Women’s T20 World Cup 2023: స్మృతి మంధాన ఆడుతుందా.. టాప్ ప్లేస్ అందుతుందా?

ఆసియా కప్‌లో భారత్ జట్టు ఆడే విషయంలో క్లారిటి రావడంతో ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరతులు పెట్టింది. ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పీసీబీ పెద్దలతో ఈ అంశంపై ఐసీసీ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌తో చర్చలు జరుపుతుంది. ఇటీవల జరిగిన చర్చల్లో వన్డే వరల్డ్ కప్‌ -2023లో పాకిస్థాన్ జట్టు భారత్‌లోని స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడాలంటే కేవలం కోల్‌కతా, చెన్నై స్టేడియాల్లోనే ఆడుతుందని పీసీబీ స్పష్టం చేసినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, బీసీసీఐ, భారత ప్రభుత్వం పీసీబీ షరతులపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

IPL 2023: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టేది అత‌డే : ర‌విశాస్త్రి

పాకిస్థాన్ 2016లో భారత్‌తో తన టీ20 ప్రపంచ‌కప్ మ్యాచ్ కోల్‌కతా స్టేడియంలో ఆడింది. ఈ స్టేడియంలో ఆడటం వల్ల పాక్ ఆటగాళ్లు భద్రతతో చాలా సంతోషంగా ఉన్నారని పీసీబీ తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా చెన్నై వేదిక పాకిస్థాన్‌కు చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్ జట్టు కనీసం తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. దీంతో కోల్‌కతా, చెన్నై స్టేడియాల్లోనే ఈ మ్యాచ్‌లు జరిగేలా చూడాలని, లేకుంటే పాకిస్థాన్ మ్యాచ్‌లు ఇతర దేశాల్లోని స్టేడియాల్లో నిర్వహించాలని పీసీబీ పేర్కొన్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

Arun Jaitley Cricket Stadium in New Delhi

Arun Jaitley Cricket Stadium in New Delhi

ఉప్పల్ స్టేడియంకు మహర్దశ ..

ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచ కప్ -2023 కు ముందు భారత్‌లోని ఐదు ప్రధాన స్టేడియాల ఆధునికీకరణకు బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. ఈ ఐదు స్టేడియంలను ఆధునికీకరించేందుకు బీసీసీఐ రూ. 500 కోట్లు ఖర్చు చేయనుంది. ఢిల్లీ స్టేడియంకు రూ. 100 కోట్లు, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు రూ. 117.17 కోట్లు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు రూ. 127.47 కోట్లు. మొహాలీలోని వృద్ధాప్య పీసీఎ స్టేడియంకు రూ. 79 కోట్లు, వాంఖడేకి రూ. 78.82 కోట్లు ఖర్చు చేయనుంది. మొహాలీలో ప్రపంచ కప్ మ్యాచ్ లేకపోయినా అక్కడ స్టేడియం మరమ్మతులకు బీసీసీఐ నిర్ణయించింది. అయితే, ఈ స్టేడియంలలో పైకప్పు నిర్మాణం కూడా ఉంటే అదనపు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.