RRR Postpone: ముంచేసిన ఆర్ఆర్ఆర్.. నా తప్పేముందంటున్న జక్కన్న!

జనవరి 7 రిలీజ్ అనగానే.. ఆ డేట్ లాక్ చేసుకోడానికి మిగిలిన వారు భయపడ్డారు. ట్రిపుల్ ఆర్ తో పోటీ ఎందుకని వెనుకడుగు వేశారు. తీరాచూస్తే.. సారీ చెప్పి సైలెంట్ గా రాజమౌళి తప్పుకున్నారు.

RRR Postpone: ముంచేసిన ఆర్ఆర్ఆర్.. నా తప్పేముందంటున్న జక్కన్న!

Rrr Postpone

RRR Postpone: జనవరి 7 రిలీజ్ అనగానే.. ఆ డేట్ లాక్ చేసుకోడానికి మిగిలిన వారు భయపడ్డారు. ట్రిపుల్ ఆర్ తో పోటీ ఎందుకని వెనుకడుగు వేశారు. తీరాచూస్తే.. సారీ చెప్పి సైలెంట్ గా రాజమౌళి తప్పుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో ఇంపార్టెంట్ వీక్.. ఎవ్వరికీ కాకుండా పోయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాదు కానీ తెలుగు రాష్ట్రాలని టార్గెట్ చేసిన మేకర్స్ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీకి థియేటర్స్ సమస్య లేదు. ఆంధ్ర టికెట్ రేట్స్ మినహాయిస్తే పరిస్థితులు బాగానే ఉన్నాయి, రిలీజ్ కి ఇబ్బంది లేదు.

OTT Release: సంక్రాంతి టార్గెట్.. ఈ వారం నుండే ఓటీటీలో పండగ!

రీసెంట్ గా ఏపీలో కూడా మూతపడిన థియేటర్ల రీ ఓపెన్ తో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారంతా. కానీ నార్త్ లోని కొన్ని రాష్ట్రాల్లో కర్నాటక, తమిళనాడు, కేరళలో ఆంక్షలున్నాయంటూ ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేశారు మేకర్స్. పాన్ ఇండియాను టార్గెట్ చేసిన.. 450 కోట్ల భారీ బడ్జెట్ సినిమా విషయంలో జక్కన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కావచ్చు. కానీ ఆ దెబ్బకి మిగతా సినిమాల లెక్కలన్నీ మారిపోయాయి. జనవరి 7 అనే మంచి టైమింగ్ ఉన్న సంక్రాంతి సీజన్ ని ట్రిపుల్ ఆర్ కారణంగా మిస్ అయ్యారని కొందరు ఫీలవుతున్నారు.

Sankranti Release: సీన్ రివర్స్.. పెద్ద పండగకి చిన్న సినిమాల హడావుడి!

జనవరి 7.. ట్రిపుల్ ఆర్ కోసం లాక్ చేసిన తర్వాత ఆ డేట్ దగ్గర్లోకి రావడానికి సౌత్ టు నార్త్ ఏ సినిమాలూ ధైర్యం చేయలేదు. రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం జనవరి 14న పక్కా అని ప్రకటించారు. వారం గ్యాప్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ కారణంగా దాదాపు నెల రోజులు ముఖ్యంగా సంక్రాంతి సీజన్ బ్లాక్ అయింది. చాలా మీటింగ్స్ తర్వాత భీమ్లానాయక్ వెనక్కి వెళ్లేలా చేశారు. బాలీవుడ్ రేస్ నుంచి గంగూబాయి కతియావాడి లాంటి సినిమాలను పోస్ట్ పన్ చేశారు. తీరా చూస్తే తను రాకా.. వేరే వాళ్లు ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి లేక.. జనవరి 7 కాస్త పెద్ద సినిమాల చేతి నుంచి జారిపోయింది.

Radhe Shyam: రాధేశ్యామ్‌కి ఓటీటీ ఆఫర్.. రూ.400 కోట్లకు పైగా డీల్!

2022.. ఫస్ట్ ఫ్రైడే జనవరి 7.. అసలు పెద్దగా సినిమాలే లేకుండా అయింది. ఇప్పుడే కాదు ట్రిపుల్ ఆర్ వల్ల గతంలోనూ తేడాలొచ్చాయి. ఫస్ట్ డేట్ ప్రకటించినప్పుడు జాగ్రత్త పడ్డారు. తర్వాత పోస్ట్ పన్ అన్నప్పుడు డీలాపడ్డారు మిగిలిన మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు మంచి డేట్స్ ఫిక్స్ చేసుకుని.. తీరా ఆ డేట్ దగ్గరపడుతున్న టైంలో మేము రాలేమని రాజమౌళి చెప్పిన ప్రతీసారి.. ఫిల్మ్ ఇండస్ట్రీకి కనిపించింది చుక్కలే.

Anaika Soti: లేలేత సొగసులతో హీటెక్కిస్తున్న అనైకా!

ఫస్ట్ 2020 జూలై 30న ట్రిపుల్ఆర్ ను తీసుకొస్తామని ప్రకటించారు రాజమౌళి. కొవిడ్ కారణంగా ఆ డేట్ నుంచి వాయిదావేస్తూ 2021 జనవరి 8న కొత్త డేట్ అనౌన్స్ చేశారు. లేదు కుదరదు అంటూ మళ్లీ అక్కడి నుంచి అక్టోబర్ 13కి రిలీజ్ డేట్ షిఫ్ట్ అయింది. అహ లేదు దసరాకు కష్టమే అని మళ్లీ 2022 సంక్రాంతిని ఫిక్స్ చేసుకోమన్నారు. చివరికి పెద్ద పండక్కి కూడా వచ్చేది లేదంటూ లేటెస్ట్ గా ట్విస్ట్ ఇచ్చారు. అయితే జక్కన్న డేట్ ప్రకటించిన ప్రతీసారి మిగిలిన మేకర్స్ వాళ్ల సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటున్నారు. పోస్ట్ పోన్ అన్నప్పుడల్లా తలలు పట్టుకుంటున్నారు.

Daniel Craig: జేమ్స్ బాండ్‌కి బుద్దుందా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

భారీ బడ్జెట్ సినిమా.. ఇండియా వైడ్ ప్రొజెక్ట్ కావాలనుకునే సినిమా కాబట్టి ట్రిపుల్ ఆర్ కోసం ప్రతీసారి మంచి సీజన్ వెతుక్కుంటున్నారు రాజమౌళి. కానీ అదే సీజన్ కు వద్దామనుకున్న వాళ్లకి ఆ ఛాన్స్ ట్రిపుల్ ఆర్ రాకపోయినా దొరకడం లేదు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీకైతే ఇలా ఓ మంచి లెసన్ చెప్పింది. కాపీ రెడీ అయినప్పుడే డిసెంబర్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ చేసుంటే బాగుండేది. లేదూ సమ్మర్ వరకు సైలెంట్ గా ఉన్నా సరిపోయేది. ఈ రెండూ చేయలేదంటూ బయటికి జాలి చూపిస్తున్నా ట్రిపుల్ ఆర్ టీమ్ ని గుర్రుగా ఉన్నవాళ్లూ ఉన్నారు. అయితే కొవిడ్ అనేది.. కొవిడ్ కారణంగా వచ్చే ఆంక్షలనేవి జక్కన్న చేతుల్లో లేవు. అంతా ఫేట్ అంటున్నారు ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్.