South West Monsoon : బ్యాడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు తక్కువే, ఆ 2నెలలు కరవుకు అవకాశం

South West Monsoon : జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవన కాలంలో ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని..

South West Monsoon : బ్యాడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు తక్కువే, ఆ 2నెలలు కరవుకు అవకాశం

South West Monsoon

South West Monsoon : నైరుతి రుతుపవనాలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. వర్షాలు బాగా కురిసి పంటలు పండితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవన కాలంలో ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తో పాటు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీంతో ఇటు రైతులతో పాటు అటు పాలకుల్లో ఆందోళన నెలకొంది. వచ్చే నైరుతి రుతుపవన కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్కైమెట్, ఐఎండీ అంచనా వేశాయి.(South West Monsoon)

2023 నైరుతి రుతుపవన కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ ప్రభావం ఉత్తర, మధ్య భారతం, వ్యవసాయ రంగంపై పడే చాన్సుంది. ప్రధానంగా సీజన్ లో చివరి రెండు నెలలు ఆగస్ట్, సెప్టెంబర్ లో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయని రెండు సంస్థలు తమ నివేదికలో ప్రస్తావించాయి.

Also Read..Andhra Pradesh : ఎండవేడికి పగిలిన కొండరాయి .. మీదపడుతుందోనని ఊరొదిలిపోతున్న జనాలు

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల నైరుతి రుతుపవనాల సీజన్ లో వర్షాలపై ఈ సంస్థలు బులెటిన్ విడుదల చేశాయి. ఈసారి ఎల్ నినో ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉందని అంచనా వేశాయి. దీంతో ఫసిపిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయి. తద్వారా అటు నుంచి వీచే వేడి గాలులతో తేమ తగ్గనుంది. ఆ ప్రభావంతో వచ్చే సీజన్ లో తక్కువ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ప్రస్తావించాయి. ఈ కారణంగా దేశంలో వ్యవసాయ రంగంలో కొత్తగా ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయని స్కైమెట్, ఐఎండీ అంచనా వేశాయి.

Also Read..Hot Summer : ఏపీలో మండుతున్న ఎండలు, ఆ జిల్లాలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వచ్చే నైరుతి సీజన్ లో 861 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవనుంది. దీర్ఘకాల సగటులో ఇది 94శాతం. పంటల దిగుబడికి అత్యంత కీలకమైన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే ఆ రెండు నెలల్లో 20శాతం మేర కరవు వచ్చే అవకావం ఉంది. ఎల్ నినో ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్కైమెట్, ఐఎండీ ప్రకటించాయి. ఎల్ నినో వస్తే నైరుతి సీజన్ లో వర్షాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేశాయి.