India vs Australia 2nd Test Match: ముగిసిన రెండో రోజు ఆట.. 62 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా .. Live Updates

ఇండియా వర్సెస్ ఆసీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో భాగంగా రెండోరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయింది.

India vs Australia 2nd Test Match: ముగిసిన రెండో రోజు ఆట.. 62 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా .. Live Updates

TeamIndia

Updated On : February 18, 2023 / 5:19 PM IST

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ త్వరగానే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఆరు పరుగులే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం ట్రావిస్ 39 పరుగులతో, మార్నస్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 61-1. ప్రస్తుతం ఆసీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో మూడు రోజుల ఆట మిగిలుంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 18 Feb 2023 05:16 PM (IST)

    262 పరుగులకు భారత్ ఆలౌట్.. ఒక్క పరుగు ఆధిక్యంలో ఆసీస్ ..

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 262 పరుగులకు ఆలౌటైంది. 83.3 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయిన టీమిండియా 262 పరుగులు సాధించింది. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులు సాధించి ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. భారత జట్టులో అక్షర్ పటేల్ అత్యధికంగా 74 పరుగులు సాధించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 44 పరుగులు, రవి చంద్రన్ అశ్విన్ 37 పరుగులు, రోహిత్ శర్మ 32 పరుగులు, రవీంద్ర జడేజా 26 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన ల్యాన్ ఐదు వికెట్లు తీశాడు. తర్వాత ముర్ఫీ, మాథ్యూ కునెమాన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది.

     

  • 18 Feb 2023 04:49 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 23 పరుగుల వద్ద ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఔటయ్యాడు. 13 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన ఉస్మాన్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ 24 పరుగులతో, మార్నస్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా 43/1.

  • 18 Feb 2023 04:04 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. అశ్విన్, అక్షర్ ఔట్

    భారత జట్టు తక్కువ వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు చేసి ఔట్వవగా, ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్ పటేల్ కూడా ఔటయ్యాడు. అక్షర్ 74 (115) పరుగులు చేసి, ముర్ఫీ బౌలింగ్‌లో క్యుమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ కూడా క్యుమిన్స్ బౌలింగ్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత స్కోరు 260/9గా ఉంది.

  • 18 Feb 2023 03:28 PM (IST)

    అర్ధ సెంచరీ పూర్తి చేసిన అక్షర్ పటేల్

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు, మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. ఆల్ రౌండర్లు అశ్విన్, అక్షర్ పటేల్ వికెట్లు పోకుండా ఆడుతూ భారత జట్టు స్కోరును ముందుకు నడిపిస్తున్నారు. అక్షర్ పటేల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కునెమాన్ వేసిన బంతిని సిక్సర్‌గా మలచడం ద్వారా అక్షర్ పటేల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ కూడా నిలకడగా ఆడుతూ 32 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అశ్విన్, అక్షర్ గౌరవ ప్రదమైన స్కోరు వైపు నడిపిస్తున్నారు. ఇద్దరూ కలిపి ఇప్పటివరకు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం

  • 18 Feb 2023 01:33 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ఆంధ్రా కుర్రాడు , టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఔట్ అయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో విఫలమైన భరత్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. నాథన్ లైయన్ వేసిన బంతికి శ్రీకర్ భరత్ (6) స్మిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 52 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోర్ 146/7. క్రీజ్‌లో అక్షర్ పటేల్, రవిచంద్ర అశ్విన్ ఉన్నారు.

  • 18 Feb 2023 01:25 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లీ ఔట్

    భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ కుహ్నెమాన్ వేసిన 50వ ఓవర్లో విరాట్ కోహ్లీ (44) ఔట్ అయ్యాడు.

  • 18 Feb 2023 01:06 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. జడేజా ఔట్

    భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. మర్ఫీ వేసిన 46.5 ఓవర్లో జడేజా (26) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కోహ్లీ( 37)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న సమయంలో జడేజా ఔట్ కావటం భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 127/5. క్రీజలో కోహ్లీ, శ్రీకర్ భరత్ ఉన్నారు.

  • 18 Feb 2023 12:35 PM (IST)

    100 పరుగులకు చేరిన భారత్ స్కోర్ ..

    విరాట్ కోహ్లీ, జడేజాలు నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా స్కోర్ క్రమంగా పెరుగుతోంది. 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా 104 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (25), విరాట్ కోహ్లీ (21) క్రీజ్‌లో ఉన్నారు. వీరు ప్రస్తుతానికి 89 బంతులకు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

  • 18 Feb 2023 11:49 AM (IST)

    భారమంతా కోహ్లీ, జడేజాలపైనే ..

    ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్‌లో నిర్దేశించిన 263 పరుగులకు చేరుకోవాలంటే టీమిండియా ఇంకా 175 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 88/4 పరుగులు. క్రీజ్ లో రవీందర్ జడేజా (15), విరాట్ కోహ్లీ (14) ఉన్నారు. వీరు నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పితే తప్ప టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశాలు తక్కువే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే జడేజా, కోహ్లీ ఎక్కువ సేపు క్రీజ్ లో ఉండాలి.

  • 18 Feb 2023 11:20 AM (IST)

    నాథన్ స్పిన్ మాయాజాలం ..

    ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ స్పిన్ మాయాజాలంకు టీమిండియా బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ బాట పడుతున్నారు. రాహుల్, రోహిత్, పుజారా, శ్రేయాస్ అయ్యర్లు వరుసగా నాథన్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యారు.

  • 18 Feb 2023 11:06 AM (IST)

    నాల్గో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ (4) ఔట్ అయ్యాడు. నాథన్ వేసిన 26వ ఓవర్లో శ్రేయాస్ హ్యాండ్స్‌కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 27 ఓవర్లకు 68/4. కోహ్లీ (11), జడేజా (0) క్రీజ్ లో ఉన్నారు.

  • 18 Feb 2023 10:48 AM (IST)

    పుజారా వందో టెస్ట్.. డకౌట్..

    ఇండియా, ఆసీస్ రెండో టెస్టులో భాగంగా రెండో రోజు 21 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆట ప్రారంభించిన టీమిండియాకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడిపోయింది. వందో టెస్టు ఆడేందుకు క్రీజ్ లోకి వచ్చిన ఛతేశ్వర్ పుజారా నిరాశపర్చాడు. పరుగులు ఏమీ చేయకుండానే డకౌట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు.  నాథన్  బౌలింగ్ లో ఎల్బీ డబ్ల్యూగా పుజారా వెనుదిరిగాడు.

  • 18 Feb 2023 10:39 AM (IST)

    మూడు వికెట్లు డౌన్.. కష్టాల్లో టీమిండియా..

    రెండోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ రూపంలో కె.ఎల్. రాహుల్ (1) ఔట్ కాగా, రోహిత్ శర్మ (32) నాథన్ లైయన్ వేసిన 20వ ఓవర్లో రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత అదే ఓవర్లో ఛతేశ్వర్ పుజారా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.

  • 18 Feb 2023 10:21 AM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..

    రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కె.ఎల్. రాహుల్ 41 బంతులు ఆడి 17 పరుగులు మాత్రమే చేశాడు. నాథన్ లైయన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత్ డీఆర్ఎస్ కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం.. పుజారా క్రీజులోకి వచ్చాడు.

  • 18 Feb 2023 10:06 AM (IST)

    వార్నర్‌కు గాయం.. మ్యాచ్‌కు దూరం ..

    ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా బౌలర్ సిరాజుద్దీన్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్‌కు గాయమైన విషయం విధితమే. దీంతో ఆసీస్ జట్టు ఫీల్డింగ్ సమయంలో వార్నర్ మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో రెన్‌షా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. మిగతా మ్యాచ్‌కూ వార్నర్ స్థానంలో రెన్‌షా నే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

  • 18 Feb 2023 09:57 AM (IST)

    దూకుడుగా ఆడుతున్న రోహిత్, రాహుల్ ..

    రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ శర్మ, కే.ఎల్. రాహుల్ దూకుడుగా ఆడుతున్నారు. 14 ఓవర్లు పూర్తయ్యే సరికి.. టీమిండియా స్కోర్ 41/0. రోహిత్ (24), రాహుల్ (13) క్రీజులో ఉన్నారు.

  • 18 Feb 2023 09:53 AM (IST)

    రెండో రోజు ఆట ప్రారంభం ..

    ఢిల్లీలో జరుగుతున్న ఇండియా, ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలిరోజు టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకొని 263 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ వికెట్ నష్టపోకుండా మొదటి రోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి 21 పరుగులు చేశారు. శనివారం 21 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రోహిత్, రాహుల్ క్రీజ్ లోకి వచ్చారు.