Gold Rate Today : శుభవార్త.. పది రోజుల తర్వాత దిగొచ్చిన పసిడి ధర

బంగారం రేటు ఎట్టకేలకు దిగొచ్చింది. 10 రోజుల తర్వాత పసిడి రేటు కాస్త తగ్గింది. ఇక వెండి ధర కూడా నాలుగు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గింది.

Gold Rate Today : శుభవార్త.. పది రోజుల తర్వాత దిగొచ్చిన పసిడి ధర

Gold Rate (2)

Gold Rate Today : బంగారం రేటు ఎట్టకేలకు దిగొచ్చింది. 10 రోజుల తర్వాత పసిడి రేటు కాస్త తగ్గింది. ఇక వెండి ధర కూడా నాలుగు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గింది. అయితే పండుగ సీజన్ అయిపోవడంతోనే బంగారం ధర తగ్గిందని భావిస్తున్నారు బులియన్ నిపుణులు. ధర ఇంకా తగ్గుతుందా? పెరుగుతుందా అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

చదవండి : Gold Price Today : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

ఇక ఈ రోజు బంగారం రేటు ఓ సారి చూస్తే నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,200గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.600 తగ్గింది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.48,220 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.650 తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.67,400 పలుకుతోంది. 10 గ్రాముల ధర రూ.674గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల వెండి ధర రూ.3 తగ్గింది. ప్రసుతం ఒక్క గ్రాము వెండి రూ.67.40కి దొరుకుతోంది.

చదవండి : Golden Bride : ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను ఓసారి చూద్దాం
.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220గా ఉంది.

చదవండి : Golden Bride : ఈమె బంగారు పెళ్లికూతురు.. వంటిపై 60కేజీల పసిడి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,220గా ఉంది.