RC 15 : సీఎంగా చరణ్!.. శంకర్ ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారా?..

సిల్వర్ స్ర్కీన్ సెల్యూలాయిడ్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజుకి 50వ సినిమా కాగా చెర్రీకిది 15వ సినిమా కావడం విశేషం..

RC 15 : సీఎంగా చరణ్!.. శంకర్ ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారా?..

Ram Charan

RC 15: సిల్వర్ స్ర్కీన్ సెల్యూలాయిడ్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజుకి 50వ సినిమా కాగా చెర్రీకిది 15వ సినిమా కావడం విశేషం..

అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటినుండి మీడియా అండ్ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా యాక్షన్ కింగ్ అర్జున్‌తో శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ‘ఒకేఒక్కడు’ మూవీకి సీక్వెల్ అని, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని, రష్మిక మందన్న హీరోయిన్ అని ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు రాసుకుంటూ పోతున్నారు..

Megastar Chiranjeevi : మెస్మరైజింగ్ మెగా అప్‌డేట్.. చరణ్, శంకర్ సినిమాలో చిరు..

కట్ చేస్తే.. ఇప్పుడీ సినిమా బ్యాక్‌డ్రాప్ గురించి, క్యారెక్టర్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.. చరణ్-శంకర్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ అని, చరణ్ క్యారెక్టర్ ఐఏస్ ఆఫీసర్ నుండి సీఎంగా టర్న్ అవుతుందని, రష్మిక జర్నలిస్ట్‌గా కనిపించనుందని నెట్టింట వార్తలు వెలిశాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.