Mumbai Indians: ఆ నలుగురు.. ముంబై రిటైన్ చేసుకుంది వారినే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఎనిమిది ఫ్రాంచైజీల కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునే గడువు మంగళవారం(30 నవంబర్ 2021) ముగిసింది.

Mumbai Indians: ఆ నలుగురు.. ముంబై రిటైన్ చేసుకుంది వారినే!

Model

IPL Retention 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఎనిమిది ఫ్రాంచైజీల కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునే గడువు మంగళవారం(30 నవంబర్ 2021) ముగిసింది. ప్రతీ జట్టు కూడా వారు రిటైన్ చేసుకున్న సభ్యుల వివరాలను వెల్లడించింది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోనున్న నలుగురు ఆటగాళ్లను కూడా ఆ జట్టు ప్రకటించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు కీరన్ పొలార్డ్‌లను ముంబై రిటైన్ చేసుకున్నట్లుగా జట్టు ప్రకటించింది.

రూ. 16 కోట్లకు రోహిత్ శర్మను ఫ్రాంచైజీ తన వద్దే ఉంచుకుంది. బుమ్రాను రూ.12 కోట్లకు, సూర్యకుమార్‌ను రూ.8 కోట్లకు, పొలార్డ్‌ను రూ.6 కోట్లకు అట్టిపెట్టుకున్నారు ముంబై వాళ్లు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను అట్టిపెట్టుకుంటుందని ముందుగానే భావించారు.

Airfares Hike : వామ్మో.. ఢిల్లీ టు న్యూయార్క్ టికెట్ ధర రూ.6 లక్షలు.. భారీగా పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు

ఫాస్ట్ బౌలింగ్ అటాక్ లీడర్ జస్ప్రీత్ బుమ్రాను, ఆల్‌రౌండర్‌ పొలార్డ్‌ని ఉంచుకుంది. అయితే సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లలో ఎవరినైనా ఎంపిక చేసుకోవడం జట్టు ముందున్న సవాల్ కాగా.. సూర్యకుమార్ వైపే జట్టు ఆసక్తి చూపింది. హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకోలేదు.. కానీ, వేలంలో కొనచ్చు అని అంటున్నారు.

Omicron : ఒమిక్రాన్ టెన్షన్.. ఇకపై 6గంటలు ఎయిర్ పోర్టులో వెయిట్ చేయాల్సిందే.. ప్రభుత్వం కొత్త రూల్

ఇషాన్ కిషన్‌ని కూడా ముంబై మళ్లీ కొనుక్కునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎనిమిది జట్లలో రిటైన్ చేయబడిన ఆటగాళ్లను ఖరారు చేసిన తర్వాత, రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్‌లు డిసెంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ముగ్గురు ఆటగాళ్లను ఎన్నుకునే అవకాశాన్ని పొందుతాయి. ఆ తర్వాత జనవరిలో వేలం నిర్వహిస్తారు. ప్రస్తుత ఎనిమిది జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవలసి ఉండగా.. అందులో కూడా ముగ్గురు భారతీయులకు మాత్రమే అవకాశం ఉంటుంది.