IPL2022 KKR Vs DC : కోల్‌కతాకు కుల్దీప్ యాదవ్ షాక్.. ఢిల్లీ ఖాతాలో రెండో విజయం

కోల్ కతాకు షాక్ ఇచ్చింది ఢిల్లీ. కోల్ కతాపై ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ తో..

IPL2022 KKR Vs DC : కోల్‌కతాకు కుల్దీప్ యాదవ్ షాక్.. ఢిల్లీ ఖాతాలో రెండో విజయం

Ipl2022 Kkr Vs Dc

IPL2022 KKR Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ పోరులో కోల్ కతాకు షాక్ ఇచ్చింది ఢిల్లీ. కోల్ కతాపై ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా.. 19.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 44 పరుగుల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ గెలుపొందింది.

కోల్ కతా బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు, లలిత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.(IPL2022 KKR Vs DC)

IPL2022 RCB Vs MI : చెన్నై బాటలో ముంబై.. వరుసగా 4వ పరాజయం.. బెంగళూరు హ్యాట్రిక్ గెలుపు

కోల్‌కతా బ్యాటర్లలో నితీశ్ రాణా (30), ఆండ్రూ రసెల్ (24) పరుగులు చేశారు. వెంకటేశ్ అయ్యర్‌ (18), సామ్ బిల్లింగ్స్‌ (15) పరుగులు చేయగా.. ఓపెనర్‌ అజింక్య రహానె (8), ప్యాట్ కమ్మిన్స్ (4), సునీల్ నరైన్‌ (4), ఉమేశ్ యాదవ్‌ (0), రసిక్‌ సలాం (7) విఫలమయ్యారు. వరుణ్‌ చక్రవర్తి (1) నాటౌట్‌గా నిలిచాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ జూలు విదిల్చింది. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ విరుచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి బంతి నుంచే పృథ్వీ షా దూకుడు కొనసాగింది. పృథ్వీ షా 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. వార్నర్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 93 పరుగులు జోడించారు.

IPL2022 SRH Vs CSK : ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ.. చెన్నైకి నాలుగో పరాజయం

కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ధాటిగా ఆడాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ (14 బంతుల్లో 22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 29 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఢిల్లీ జట్టు 200 మార్కు దాటింది. శార్దూల్ ఠాకూర్ 1 ఫోర్, 3 సిక్సులు బాదడం విశేషం.

కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, ఉమేశ్ యాదవ్ 1, ఆండ్రూ రసెల్ 1 వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్… బౌలింగ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. 4 ఓవర్లు వేసిన కమిన్స్ ఒక్క వికెట్టూ తీయకపోగా, ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు.

జట్ల వివరాలు :
కోల్‌కతా : శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), సామ్‌ బిల్లింగ్స్, అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రస్సెల్, సునీల్ నరైన్, కమిన్స్, ఉమేశ్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, రసిక్‌ సలామ్‌

ఢిల్లీ : రిషబ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, పావెల్, సర్ఫరాజ్‌ ఖాన్‌, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముస్తాఫిజర్‌ రహ్మాన్‌, ఖలీల్‌ అహ్మద్