Uttarakhand: డేంజర్ జోన్‌లో జోషిమఠ్ .. ఇస్రో శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలు విడుదల

శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకాశీలో 2.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అర్థరాత్రి తరువాత 2.12 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలాఉంటే జోషిమఠ్‌ పట్టణంలో నివసిస్తున్న 169 కుటుంబాలను ఇప్పటి వరకు సహాయ కేంద్రాలకు తరలించారు.

Uttarakhand: డేంజర్ జోన్‌లో జోషిమఠ్ .. ఇస్రో శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలు విడుదల

The land subsidence was slow between April and November 2022, during which Joshimath had sunk by 8.9 cm

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది. ఆ ప్రాంతంలో సుమారు ఏడు వందలకుపైగా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. దీంతో కూలేందుకు సిద్ధంగా ఉన్ననివాస ప్రాంతాల వారిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. మరోవైపు వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. స్థానిక ప్రజలు భారంగా తమ నివాసాలను వీడుతున్నారు. తాజాగా జోషిమఠ్‌లోని ప్రమాద తీవ్రతను తెలియజేస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ జోషిమఠ్ నగరంకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాలను బట్టిచూస్తే జోషిమఠ్ రోజురోజుకు డేంజర్ జోన్‌లోకి వెళ్తున్నట్లు అర్థమవుతుంది.

 

subsidence zone in Joshimath.

ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కేవలం 12 రోజుల్లోనే 5.4 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోయినట్లు తెలుస్తుంది. 2022 డిసెంబర్ 27న ఉపగ్రహ చిత్రాలు, జనవరి 8న 2023న ఉపగ్రహ చిత్రాల మధ్య 5.4 సెంటీమీటర్ల  మేర కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొంది. ఏప్రిల్ 2022, నవంబర్ 2022 మధ్య జోషిమఠ్ నెమ్మదిగా 9 సెంటీ మీటర్ల క్షీణతను చూసింది. డిసెంబర్, జనవరి మొదటివారం మధ్య వేగంగా క్షీణత ప్రారంభమైందని ఎన్ఎస్ఆర్సీ గత వారం తెలిపింది.

 

The land subsidence was slow between April and November 2022, during which Joshimath had sunk by 8.9 cm

The land subsidence was slow between April and November 2022, during which Joshimath had sunk by 8.9 cm

 

ఇదిలాఉంటే శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకాశీలో 2.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అర్థరాత్రి తరువాత 2.12 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలాఉంటే జోషిమఠ్‌ పట్టణంలో నివసిస్తున్న 169 కుటుంబాలను ఇప్పటి వరకు సహాయ కేంద్రాలకు తరలించారు.