Jai Bheem : ‘జై భీమ్’ సినిమా కథ అసలు హీరో ఈయనే

'జై భీమ్' సినిమా ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ కి సంబంధించిన కథ. సూర్య పోషించిన చంద్రూ పాత్ర గురించి ఇప్పుడు అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. చంద్రూ అనే ఓ లాయర్. 90వ దశకంలో తమిళ

Jai Bheem :  ‘జై భీమ్’ సినిమా కథ అసలు హీరో ఈయనే

Jai Bheem

Jai Bheem :  తమిళ్ స్టార్ హీరో సూర్య ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం, కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేస్తున్నాడు. కెరీర్ మొదటి నుంచి సూర్య ఇదే చేస్తున్నాడు. గత సంవత్సరం ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపినాథ్ జీవిత చరిత్రని ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాగా తీసి మంచి విజయం సాధించాడు. ఈ సినిమాలో సూర్య నటనకి విమర్శకుల నుంచి సైతం ప్రశంశలు వచ్చాయి. తాజాగా మరో బయోపిక్ తో వచ్చి సూర్య మరోసారి అద్భుతమైన విజయం సాధించాడు.

Gautham Vasudev Menon : నాకు తెలియకుండా వాళ్ళ సినిమాలో నన్ను అనౌన్స్ చేశారు : గౌతమ్ వాసుదేవ్ మీనన్

చంద్రూ అనే ఒక అడ్వకేట్ జీవిత చరిత్రని, ఒక కేసు విషయంలో నిస్వార్థంగా ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య. ఈ సినిమా దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. సూర్య సొంత బ్యానర్లో ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఈ సినిమాకి జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురించి అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ‘జై భీమ్’ సినిమా ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ కి సంబంధించిన కథ. సూర్య పోషించిన చంద్రూ పాత్ర గురించి ఇప్పుడు అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

Janhvi Kapoor : వసంత కోకిల శ్రీదేవిని తలపిస్తున్న కూతురు జాన్వీ

ఈ కథకు స్ఫూర్తి చంద్రూ అనే ఓ లాయర్. 90వ దశకంలో తమిళనాడులో జరిగిన ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ తో ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి చలించిపోయిన చంద్రూ వాళ్ల తరఫున నిలబడి తన న్యాయ పోరాటాన్ని చేశాడు. ఎన్నో అవాంతరాలను, సవాళ్లను ఎదుర్కొని గిరిజనుల కుటుంబానికి న్యాయం జరిగేలా చేశాడు. ఈ ఒక్క కేసును మాత్రమే కాదు ఎంతోమంది సామాన్యుల తరఫున నిలబడి వాళ్లకి న్యాయం జరిగేవరకూ పోరాటం చేశారు చంద్రూ. ఆ తరువాత ఆయన జడ్జిగా కూడా పనిచేశారు. జడ్జిగా ఉన్నప్పుడు కేసులు పెండింగులో పెట్టడానికి ఆయన ఎంతమాత్రం ఇష్టపడేవారు కాదు. సాధ్యమైనంత త్వరగా కేసులను పరిష్కరించడానికి ఆయన ట్రై చేశారు. జడ్జిగా తన ఆరేళ్ల పదవీ కాలంలో దాదాపు 96 వేలకి పైగా కేసులను పరిష్కరించి కొత్త రికార్డును సృష్టించారు. లాయర్ గా, జడ్జిగా చేస్తూ కూడా సామాజిక అసమానతల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పదవి విరమణకు ముందు, ఆ తరువాత ఆస్తుల వివరాలను వెల్లడించి ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిచారు.

Samantha : రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. వర్కౌట్ అవుతుందా??

అలాంటి వ్యక్తి గురించి బయోపిక్ తీసి అందరికి తెలిసేలా చేసిన సూర్యను ఇప్పుడు అందరూ ప్రశంశిస్తున్నారు. ఇటీవల నేరస్థుల కథలని బయోపిక్స్ గా తీస్తున్నారు. అలాంటి వాళ్ళు సూర్యని చూసి నేర్చుకొని సమాజానికి మంచి చేసిన వాళ్ళ జీవిత చరిత్రలని తీయండి సినిమాలుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.