Jio 5G – Airtel 5G : భారతీయ నగరాల్లో జియో – ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Jio 5G And Airtel 5G : రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ 5G (Airtel 5G) ప్రస్తుతం అనేక భారతీయ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులతో సిద్దంగా ఉన్నాయి. దేశంలో క్రమంగా మరిన్ని నగరాలకు 5G సర్వీసులను అందిస్తున్నాయి.

Jio 5G – Airtel 5G : భారతీయ నగరాల్లో జియో – ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Jio 5G and Airtel 5G _ Full list of Indian cities, how to access 5G service, and activate it

Jio 5G And Airtel 5G : రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ 5G (Airtel 5G) ప్రస్తుతం అనేక భారతీయ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులతో సిద్దంగా ఉన్నాయి. దేశంలో క్రమంగా మరిన్ని నగరాలకు 5G సర్వీసులను అందిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్, జియో తమ 5G సర్వీసులు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. రాబోయే రోజుల్లో దేశమంతటా 5G సర్వీసులను వేగంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ప్రస్తుతానికి, Airtel, Jio నుంచి 5G సర్వీసుల వినియోగంపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. టెలికాం కంపెనీలు ప్రస్తుతానికి యూజర్లకు ఉచితంగా 5G సర్వీసులను అందిస్తున్నాయి. 5G యాక్టివేట్ చేసుకోవాలంటే వారి సిమ్ కార్డ్‌లను మార్చాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ నెట్‌వర్క్ 4G కన్నా 10 రెట్లు ఎక్కువ స్పీడ్‌ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ స్పీడ్ పొందలేకపోయినా కచ్చితంగా 5Gతో మెరుగైన ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.

Jio 5G and Airtel 5G _ Full list of Indian cities, how to access 5G service, and activate it

Jio 5G and Airtel 5G _ Full list of Indian cities, how to access 5G service

Jio 5G : భారతీయ నగరాల పూర్తి లిస్టు ఇదే :
– హైదరాబాద్
– బెంగళూరు
– ముంబయి
– చెన్నై
– వారణాసి
– కోల్‌కతా
– ఢిల్లీ
-గురుగ్రామ్
– నోయిడా
– ఘజియాబాద్
– ఫరీదాబాద్
-ఇతర ఢిల్లీ-NCR ప్రాంతాలు

Airtel 5G : భారతీయ నగరాల పూర్తి జాబితా ఇదే :

– పూణె
– ఢిల్లీ
-ముంబయి
-చెన్నై
-హైదరాబాద్
– బెంగళూరు
-పానిపట్
-గురుగ్రామ్
– సిలిగురి
– బెంగళూరు
-నాగ్‌పూర్

Jio 5G and Airtel 5G _ Full list of Indian cities, how to access 5G service, and activate it

Jio 5G and Airtel 5G _ Full list of Indian cities, how to access 5G service, and activate it

మొబైల్ ఫోన్‌లో 5G సర్వీసును ఎలా యాక్సస్ చేయాలంటే? :
రిలయన్స్ జియో యూజర్లందరూ 5G సర్వీసులను యాక్సెస్ చేయలేరు. కంపెనీ యాదృచ్ఛికంగా 5G వెల్‌కమ్ ఆఫర్‌ను యూజర్లకు పంపుతోంది. మీరు అదృష్టవంతులైతే.. మీకు కూడా వెల్ కమ్ ఆఫర్ ఇన్విటేషన్ రావొచ్చు. కానీ, ఎయిర్‌టెల్ యూజర్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ 5G యాక్సెస్‌ను అందిస్తోంది.

ఫోన్‌లో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
మీ ఫోన్‌లో 5G సర్వీసును యాక్టివేట్ చేయడానికి ప్రక్రియ ఏదీ లేదు. మీరు మీ మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి 5G నెట్‌వర్క్‌ని ఎంచుకోవాలి. మీరు 5G అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని నిర్థారించుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేస్తుందని నిర్ధారించుకోవాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter At Risk : ఉద్యోగుల రాజీనామాలతో డేంజర్‌లో ట్విట్టర్.. ఏ క్షణమైన షట్‌డౌన్ కావొచ్చు.. యూజర్లు అకౌంట్ డేటాను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!