Jr NTR New Car : తారక్.. కొత్త కార్ కిరాక్..!

ఎన్టీఆర్‌కి రేసింగ్ బైక్స్, లగ్జరీ కార్లంటే భలే ఇష్టం.. అందుకే ఇటీవల ఇటలీ లంబోర్ఘిని కార్ బుక్ చేశారు..

Jr NTR New Car : తారక్.. కొత్త కార్ కిరాక్..!

Jr Ntr New Car

Updated On : November 18, 2021 / 4:27 PM IST

Jr NTR New Car: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఏ చిన్న అప్‌‌డేట్ వచ్చినా.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్, మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్న తారక్ అభిమానులు మరో క్రేజీ న్యూస్‌తో నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.

NTR – Ram Charan : ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’..

ఎన్టీఆర్‌కి రేసింగ్ బైక్స్, లగ్జరీ కార్లంటే భలే ఇష్టం. అందుకే ఇటీవల ఇటలీ లంబోర్ఘిని కార్ బుక్ చేశారు. ఆగస్టు 16న Lamborghini Urus Graphite Capsule ఇండియాలో లాంచ్ అయింది. ఇండియాలో దీని రేటు 3 కోట్లకు పైనే. అత్యాధునిక ఫీచర్లతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేసిన ఈ కార్‌లో త్వరలోనే తారక్ హైదరాబాద్ రోడ్ల మీద షికారు చెయ్యబోతున్నారు.

Jr NTR : తారక్ కారు నెంబర్ 9999 వెనుక కారణం ఏంటంటే..!

సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘ఆర్ఆర్ఆర్’ బ్యాలెన్స్ సాంగ్స్ షూట్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. తర్వాత గుమ్మడికాయ కొట్టేస్తారు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత కొరటాల శివతో చెయ్యబోయే సినిమా షూటింగులో పాల్గొంటారు. తారక్ హోస్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఆగస్టు 22 నుంచి ప్రసారం కాబోతుంది. కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ గెస్ట్‌గా కనిపించనున్నారు.

RRR : అంచ‌నాలు పెంచేలా.. అదిరిపోయే ప్లాన్ చేసిన జక్కన్న..