MLA Raghunandan: రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధింపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు.. జూన్ 25ను బ్లాక్ డేగా ప్రకటించాలి

తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చే పరిస్థితులు కల్పించేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు.

MLA Raghunandan: రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధింపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు.. జూన్ 25ను బ్లాక్ డేగా ప్రకటించాలి

Mla Ragunandan Rao

MLA Raghunandan: తెలంగాణలో ఎమర్జెన్సీ తెచ్చే పరిస్థితులు కల్పించేలా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘనందన్ రావు మాట్లాడారు. భారత దేశంలో జూన్ 25ను బ్లాక్ డే గా ప్రకటించాలని అన్నారు.

Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్

ప్రతిపక్షాల మీద జూన్ 25 ఎలాగ ఉండేదో ఇప్పుడు తెలంగాణలోకూడా అలాగే ఉందని రఘునందన్ విమర్శించారు. గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరు కూడా తిరిగే హక్కు లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని రఘునందన్ అన్నారు. గతంలో ఇందిరా గాంధీ ప్రతిపక్షాలను ఎలాగైతే అణిచివేత ప్రయత్నాలు చేసిందో ఇప్పుడు కూడా తెలంగాణలో అలాగే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.