Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సమర్థతను చాటారు.

Ujjal Bhuyan
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిమిషాలకు రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భూయన్ చేత గవర్నర్ తమిళి సై ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.
గత కొద్ది రోజులుగా రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ పెరగడంతోనే…చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం తర్వాత…ఇవాళ లేదా రేపు స్వయంగా సీఎం కేసీఆర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Judge Posts : తెలంగాణ హైకోర్టు లో 50 సివిల్ జడ్జి పోస్టుల భర్తీ
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న భూయాన్ అస్సాంలో జన్మించారు. 1991లో న్యాయవాది వృత్తి చేపట్టారు. గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సమర్థతను చాటారు.