K Viswanath : వెంటవెంటనే రెండు సార్లు బెస్ట్ డైరెక్టర్ అవార్డులు.. హ్యాట్రిక్ అవార్డులు.. కె.విశ్వనాథ్ అవార్డులు, రివార్డులు..

ఆయన సినిమాలతో ఎన్నో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక అవార్డు వచ్చింది. అంతలా ఆయన సినిమాలు అవార్డుల జ్యురి మెంబర్స్ ని కూడా కదిలించాయి. నంది అవార్డ్స్ లో వెంటవెంటనే బెస్ట్ డైరెక్టర్ అవార్డులు సాధించారు కె.విశ్వనాథ్..............

K Viswanath : వెంటవెంటనే రెండు సార్లు బెస్ట్ డైరెక్టర్ అవార్డులు.. హ్యాట్రిక్ అవార్డులు.. కె.విశ్వనాథ్ అవార్డులు, రివార్డులు..

Kalatapaswi K Viswanath Awards and rewards

K Viswanath :  అయన సినిమాల్లోని పాటలతో మనల్ని సమ్మోహనపరిచి, అయన సినిమాలతో మనలో ఉన్న కళలని బయటకి రప్పించి, ఆయన సినిమాలతో మనల్ని ప్రేమలో పడేలా చేసి.. ఎన్నో కల్ట్ క్లాసిక్స్ లాంటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించడమే కాకుండా భావి దర్శకులకు ఒక మార్గదర్శకంగా నిలిచారు కె.విశ్వనాథ్. గురువారం రాత్రి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కి తరలిస్తుండగా కె.విశ్వనాథ్ కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆయన సినిమాలతో ఎన్నో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక అవార్డు వచ్చింది. అంతలా ఆయన సినిమాలు అవార్డుల జ్యురి మెంబర్స్ ని కూడా కదిలించాయి. నంది అవార్డ్స్ లో వెంటవెంటనే బెస్ట్ డైరెక్టర్ అవార్డులు సాధించారు కె.విశ్వనాథ్. 1986 స్వాతిముత్యం, 1987 శ్రుతిలయలు సినిమాలకు వెనువెంటనే బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు తీసుకున్నారు. 1980లో బెస్ట్ సెకండ్ స్టోరీ రైటర్ గా శంకరాభరణం సినిమాకి, 1981లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు సప్తపది సినిమాకి, 1982 బెస్ట్ స్టోరీ రైటర్ శుభలేఖ సినిమాకి, 1986,87 బెస్ట్ డైరెక్టర్, 1995 బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ శుభసంకల్పం సినిమాకి, 2000 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కలిసుందాంరా సినిమాకు నంది అవార్డులు గెలుచుకున్నారు.

1980లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా శంకరాభరణం నేషనల్ అవార్డు గెలుచుకుంది. 1982లో సప్తపది సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం నేషనల్ అవార్డు, 1987,90, 2005 లలో స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం సినిమాలకు బెస్ట్ ఫీచర్ ఫిలిం తెలుగు నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు. 1992లో కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2017 లో భారతదేశంలోని అత్యంత విలువైన సినిమా అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1992లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డులు గెలుచుకున్నారు. ఇవే కాక లోకల్ అవార్డులు లెక్కలేనన్ని, పలు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు.

K Viswanath : శివలీల.. శంకరాభరణం రిలీజ్ డేట్ రోజే.. కళా తపస్వి కన్నుమూత..

ఇక ఫిలింఫేర్ అవార్డులతో అయితే హిస్టరీ క్రియేట్ చేశారు. ఫిలింఫేర్ అవార్డుల్లో 1974, 1975 సంవత్సరాల్లో ఓ సీత కథ, జీవన జ్యోతి సినిమాలకు వెంటవెంటనే బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్నారు. 1982,83లలో శుభలేఖ, సాగరసంగమం సినిమాలకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు, 1986,1987 స్వాతిముత్యం, శ్రుతిలయలు సినిమాలకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకొని ఇలా వెంటవెంటనే బెస్ట్ డైరెక్టర్ గా మూడు సార్లు తీసుకొని హ్యాట్రిక్ కొట్టారు. 1992 ఆపద్భాంధవుడు, 1995 శుభ సంకల్పం సినిమాలకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు మొత్తంగా 8 ఫిలింఫేర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డులు గెలుచుకున్నారు కె. విశ్వనాథ్. 1994లో ఫిలింఫేర్ లైఫ్ టైం అచివ్మెంట్ గెలుచుకున్నారు. ఇలా లెక్కపెట్టలేనన్ని అవార్డులతో పాటు, లెక్కకట్టలేనంత మంది అభిమానులని, వెలకట్టలేని అభిమానాన్ని, ప్రేమని సంపాదించుకొని తరతరాలకు సరిపోయే సినీ సంపదని తెలుగువారికి ఇచ్చి దివికేగారు కె. విశ్వనాథ్.