Kamal Haasan : అరవింద్ కేజ్రీవాల్‌తో కమల్‌హాసన్ మీటింగ్.. తమిళ రాజకీయాల్లో నెలకొన్న ఆసక్తి..

కమల్ హాసన్ నిన్న స్వయంగా వెళ్లి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఆ తర్వాత కాసేపు కేజ్రీవాల్ తో ముచ్చటించారు. ఆ తర్వాత దీని గురించి...........

Kamal Haasan : అరవింద్ కేజ్రీవాల్‌తో కమల్‌హాసన్ మీటింగ్.. తమిళ రాజకీయాల్లో నెలకొన్న ఆసక్తి..

Kamal

Kamal Haasan :  ఇటీవల జరిగిన 5 స్టేట్ ఎలెక్షన్స్ లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించగా, పంజాబ్ లో మాత్రం అనూహ్యంగా ఆప్ విజయం దక్కించుకుంది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పంజాబ్ లో ఆప్ విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలేదు కూడా. ఆప్ పంజాబ్ లో విజయం సాధించడంతో అంతా అరవింద్ కేజ్రీవాల్ ని అభినందిస్తున్నారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ని కమల్ హాసన్ స్వయంగా కలిసి అభినందించారు.

కమల్ హాసన్ నిన్న స్వయంగా వెళ్లి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఆ తర్వాత కాసేపు కేజ్రీవాల్ తో ముచ్చటించారు. ఆ తర్వాత దీని గురించి కమల్ ట్వీట్ కూడా చేశారు. కేజ్రీవాల్ తో ఉన్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ”అద్భుత విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి అభినందనలు. ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసిన పదేండ్లలోనే ఢిల్లీలో రెండు సార్లు అధికారంలోకి రావడంతోపాటు తాజాగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం” అంటూ పోస్ట్ చేశారు.

Thaman : ‘రాధేశ్యామ్’ ట్రోలింగ్‌పై కౌంటర్ ఇచ్చిన తమన్

కమల్‌ హాసన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్య కొన్నేళ్ల కిందట నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి. కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి రావాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ 2017లోనే పిలుపునిచ్చారు. అయితే కమల్ 2018లో మక్కల్ నీది మైయం (ఎంఎన్‌ఎం) పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు తమిళనాడు, పాండిచ్చేరి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయగా దారుణంగా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తో కమల్ మీటింగ్ ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆప్ తో కలిసి కమల్ తమిళనాడులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు.