Tollywood : తెలుగు వారికి మరింత దగ్గరవుతున్న కన్నడ, మలయాళం స్టార్లు..

సుదీప్.. మనందరికీ పరిచయం అయిన కన్నడ స్టార్. పృథ్విరాజ్ సుకుమారన్ మలయాళం ఓటీటీ సినిమాలతో మన ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఆ పాపులారిటీని వాళ్లిద్దరూ.....................

Tollywood : తెలుగు వారికి మరింత దగ్గరవుతున్న కన్నడ, మలయాళం స్టార్లు..

Star Heros :  సుదీప్.. మనందరికీ పరిచయం అయిన కన్నడ స్టార్. పృథ్విరాజ్ సుకుమారన్ మలయాళం ఓటీటీ సినిమాలతో మన ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఆ పాపులారిటీని వాళ్లిద్దరూ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. విక్రాంత్ రోనా కోసం సుదీప్, కడువా సినిమా కోసం పృథ్విరాజ్ హైదరాబాద్ లో వాలిపోయారు.

ఇటీవల కన్నడ, మలయాళ సినిమాలు మార్కెట్ స్పాన్ పెంచుకుంటున్నాయి. ఈగ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గెరైన సుదీప్, బాహుబలి, సైరా లాంటి సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం విక్రాంత్ రోణ భారీ బడ్జెట్ సినిమాతో జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా చిన్నది అయిన కన్నడ సినీ ఇండస్ట్రీకి కేజిఎఫ్ ఇచ్చిన బూస్టప్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతో కన్నడ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుదీప్ విక్రాంత్ రోణా.

Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..

ఈ గురువారం రామ్ చరణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా తెలుగు ట్రయిలర్ ఆకట్టుకుంటుంది. సుకుమార్, ఆర్జీవి, అఖిల్, సురేందర్ రెడ్డి ఇంకా విజయేంద్ర ప్రసాద్ లాంటి అతిథులు హాజరై శుక్రవారం హైదరాబాద్ లో విక్రాంత్ రోణా త్రిడి ట్రయిలర్ రిలీజ్ చేసి, ఈ సినిమాపైన మరిన్ని అంచనాలు పెంచేశారు. అనూప్ బండారి తెరకెక్కించిన ఈ సినిమాలో నిరూప్ బండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదే కోవలో మలయాళ మల్టీ టాలెంటెడ్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తుంది. ఇప్పటి వరకూ తెలుగులో ఈయన నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు కాని, తెలుగులో రీమేక్ అయిన ఈయన సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే లేటెస్ట్ ఓటిటిలో రిలీజ్ అయిన జనగణమన సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో దేశవ్యాప్తంగా మార్కెట్ స్పాన్ పెంచుకునే పనిలో పడ్డాడు పృథ్విరాజ్. కడువా సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే హైదరాబాద్ లో ఈ శుక్రవారం కడువా టీజర్ లాంచ్ చేశారు. ఇలా కన్నడ, మలయాళం స్టార్లు కూడా తమ మార్కెట్ పెంచుకోవడానికి టాలీవుడ్ నుంచే మొదలుపెట్టారు.