Karthika Deepam : కార్తీకదీపం మోనిత హీరోయిన్.. డాక్టర్ బాబు తమ్ముడు హీరోగా సినిమా

తాజాగా ఈ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ వేసే శోభా శెట్టి హీరోయిన్ గా సినిమా రాబోతుంది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు నిరుపమ్ తమ్ముడు పాత్రలో చేస్తున్న యశ్వంత్ హీరోగా ఈ సినిమా..........

Karthika Deepam : కార్తీకదీపం మోనిత హీరోయిన్.. డాక్టర్ బాబు తమ్ముడు హీరోగా సినిమా

Monitha

Karthika Deepam :  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన సీరియల్ కార్తీక దీపం. తెలుగిళ్ళల్లో ఈ సీరియల్, సీరియల్ లోని పాత్రలు ఒకటిగా కలిసిపోయాయి. ఐపీఎల్, బిగ్ బాస్ లాంటివి ఎన్ని వచ్చినా ఈ సీరియల్ టిఆర్పి ఇంచు కూడా తగ్గలేదంటే మనమే అర్ధం చేసుకోవచ్చు ఈ సీరియల్ ఎంత ఫేమస్సో. ఇక ఇందులోని క్యారెక్టర్స్ వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత కూడా అంతే ఫేమస్. వాళ్ళ ఒరిజినల్ పేర్ల కంటే క్యారెక్టర్ పేర్లతోనే వాళ్ళు బాగా తెలుసు జనాలకి. ఈ సీరియల్ తో మంచి ఫేమ్ కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ ఫేమ్ సినిమాల్లో వాడుతున్నారు.

ఇప్పటికే ఈ సీరియల్ లో నిరుపమ్ కి తల్లిగా చేసే క్యారెక్టర్ చాలా సినిమాల్లో ఛాన్సులు సంపాదించి దూసుకుపోతుంది. తాజాగా ఈ సీరియల్ లో మోనిత క్యారెక్టర్ వేసే శోభా శెట్టి హీరోయిన్ గా సినిమా రాబోతుంది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు నిరుపమ్ తమ్ముడు పాత్రలో చేస్తున్న యశ్వంత్ హీరోగా ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి శోభాశెట్టి (మోనిత)నే ప్రొడ్యూసర్ కావడం విశేషం.

Dhanush : ధనుష్ హీరో.. నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి

ఈ సీరియల్ తో వచ్చిన ఫేమ్ ని దృష్టిలో పెట్టుకొని శోభాశెట్టి ఏకంగా నిర్మాతగా మారి తనే హీరోయిన్ గా, యాశ్వంత్ హీరోగా ‘బుజ్జి బంగారం’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయింది. ఇందులో యశ్వంత్ పైకి శోభాశెట్టి ఎక్కి గట్టిగా కౌగలించుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది మంచి లవ్ రొమాంటిక్ సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. మరి సీరియల్ ని ఆదరించినట్లు సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.