Ambedkar statue: 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. ప్రకాశ్ అంబేద్కర్ ఏమన్నారంటే?

Ambedkar statue: అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. నూతన సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్ ప్రాంతాలు జన సందోహంగా మారాయి.

Ambedkar statue: 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. ప్రకాశ్ అంబేద్కర్ ఏమన్నారంటే?

Ambedkar statue

Ambedkar statue: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు.

అంతకు ముందు అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. బౌద్ధమత ప్రార్థనలు చేశారు. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్ ప్రాంతాలు జన సందోహంగా మారాయి. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇది దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. ట్యాంక్ బండ్ వద్ద 11 ఎకరాల 80 సెంట్ల స్థలంలో ఇక్కడ స్మృతివనాన్ని అభివృద్ధి చేశారు. 2016లో అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2018 డీపీఆర్ కోసం ఉత్తర్వులు జారీ చేసి, 2020, సెప్టెంబర్ 16న రూ.146.50 కోట్ల మంజూరు చేసింది ప్రభుత్వం. 50 అడుగుల ఎత్తైన పార్లమెంట్ నమూనా పీఠంపై అంబేద్కర్ విగ్రహం ఉంటుంది.

అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్, కేటీఆర్, హరీశ్ రావు, తెలంగాణ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహ రూపకల్పనపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు.

మార్పు కోసం సంఘర్షణ తప్పదు

సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. మార్పు కోసం అంబేద్కర్ భావజాలం అవసరమని తెలిపారు. రూపాయి సమస్యలపై అంబేద్కర్ 1923లోనే పరిశోధనా పత్రం రాశారని చెప్పారు. అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకుగాను తాను కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

ప్రకాశ్ అంబేద్కర్ ఇంకా ఏమన్నారంటే?

* తెలుగులో మాట్లాడలేకపోతునందుకు చింతిస్తూ హిందీలోనే మాట్లాడతాను

* ముఖ్యమంత్రి కేసీఆర్ కు నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా

* దేశంలో కొత్త నడవడికను మొదలు పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్

* అంబేద్కర్ జయంతిని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రత్యేకంగా నిర్వహించారు0

* మనం యుద్ధం చేయాలి ప్రజల్లో మార్పుకోసం, వ్యవస్థలో మార్పు కోసం, దేశంలో మార్పు కోసం

* దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త దిశ చూపించారు

* దేశంలో ఆర్థిక అసమానతలపై ఆనాడే అంబేద్కర్ ఫైట్ చేశారు

* అంబేద్కర్ స్ఫూర్తితో మళ్లీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని కాపాడేందుకు ఫైట్ చేసేందుకు కేసీఆర్ దిశ మొదలుపెట్టారు

* దేశంలో ఒక్క రిలీజియస్ మైనార్టీ మాత్రమే లేదు…కమ్యూనిటీ మైనార్టీ కూడా ఉంది

* రిలీజియస్ మైనార్టీ తరహాలో…కమ్యూనిటీ మైనార్టీ ఉందని ఆనాడే అంబేద్కర్ చెప్పారు

* అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది

* దళిత బంధు పథకం మంచి పథకం

* ఈ దేశంలో గొప్పుడు గొప్పగా.. పేదోడు పేదోడిగానే ఉంటాడు

* దళిత బంధు ఫలితం రానున్న రోజుల్లో తెలుస్తుంది

* దళిత బంధు ఇవ్వాళ కేసీఆర్ స్టార్ట్ చేశారు… రానున్న రోజుల్లో మరో ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తారు చేయాలని కోరుకుంటున్నా

* దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరం… అది హైదరాబాద్ అయితేనే బాగుంటుంది

* హైదరాబాద్ రెండో రాజధాని అవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.. అది నెరవేరాలని కోరుకుంటున్నా

* హిందువులకు, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే ప్రతిపాదన మేరకు ఇండియా, పాకిస్తాన్ ఏర్పాటు జరిగాయి

* ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకుడు లేడు… గతంలో వాజపేయీ మాత్రమే జాతీయ నాయకుడు

* తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉంది… దేశానికి మోడల్ అవసరం

Andhra Pradesh : బీజేపీ విధానాలనే ఏపీలో వైసీపీ అమలు చేస్తోంది : సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్