Keerthy Suresh : కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుందా.. కీర్తి మదర్ క్లారిటీ!

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోతుందా. కాగా గత కొన్ని రోజులుగా ఈ భామ గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే ఈ భామ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. తాజాగా కీర్తి సురేష్ అమ్మ..

Keerthy Suresh : కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుందా.. కీర్తి మదర్ క్లారిటీ!

Keerthy Suresh

Keerthy Suresh : సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోతుందా. కాగా గత కొన్ని రోజులుగా ఈ భామ గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే ఈ భామ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. గతంలో కూడా కీర్తి.. దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోని, సంగీత దర్శకుడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 13 ఏళ్ళ నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ, త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి.

Keerthy Suresh : దసరా యూనిట్‌కి కీర్తి సురేష్ బంగారు కానుకలు..

దీంతో కీర్తి సురేష్ అమ్మ, అలనాటి నటి మేనక క్లారిటీ ఇచ్చింది. కీర్తి ప్రేమలో ఉంది, త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. నా కూతురు తరుపు నుంచి వాటిని నేను ఖండిస్తున్నాను అంటూ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలతో కీర్తి సురేష్ పెళ్లి వార్తలకు చెక్ పడింది. ఇక కీర్తి సురేష్ సినిమా విషయాలకి వస్తే.. ఈ భామ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు, మిగిలినవి తమిళ సినిమాలు. తెలుగులో నాని సరసన ‘దసరా’, చిరంజీవికి చెల్లిగా ‘భోళాశంకర్’లో నటిస్తుంది.

భోళాశంకర్ చిత్రీకరణ దశలో ఉండగా, దసరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ విడుదలకు సిద్దమవుతుంది. దసరా సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామరస్ పాత్రలో కనిపించబోతుంది. నిన్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. 90 కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. మర్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.