Kerala Governor: తమిళనాడు గవర్నర్ ఎఫెక్ట్? ప్రభుత్వ ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివిన కేరళ గవర్నర్
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహాజంగానేనో కానీ పినరయి విజయన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా గవర్నర్ చదివారు. ఈ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై పేర్కొన్న విమర్శల్ని సైతం ఆయన చదవడం గమనార్హం.

Governor Arif Mohammed Khan sticks to Kerala government speech
Kerala Governor: కొద్ది రోజుల క్రితం స్టాలిన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి పూర్తిగా చదవకపోవడమే కాకుండా కొన్ని అంశాలను మార్చి చదవడంతో తీవ్ర వివాదం నెలకొంది. తమిళనాడు గవర్నర్ మీద అధికారి డీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతకు ముందే తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని గవర్నర్ చేసిన సూచనకే తమిళులు మండిపోతున్న తరుణంలో ఇక ప్రభుత్వ ప్రసంగం దానికి ఆజ్యం పోసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే.
Kerala: కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు ఒక వ్యక్తి హత్య
బహుశా.. ఈ ప్రభావమే కావొచ్చు.. తాజాగా కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సోమవారం తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని అక్షరం పొల్లు పోకుండా పఠించారు. వాస్తవానికి గవర్నర్ మహ్మద్ ఖాన్‌కు కేరళ ప్రభుత్వానికి మధ్య కూడా వాతావరణం ఉప్పు నిప్పుగానే ఉంది. ఇక్కడ కూడా చాలా కాలంగా గవర్నర్ మీద ప్రభుత్వ విమర్శలు, ప్రభుత్వంపై గవర్నర్ అజమాయిషి కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆరిఫ్ సైతం పినరయి విజయన్ ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవచ్చనే ముందస్తు ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడి గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రభావితం చేశాయో లేదంటే, సహాజంగానేనో కానీ పినరయి విజయన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా గవర్నర్ చదివారు. ఈ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై పేర్కొన్న విమర్శల్ని సైతం ఆయన చదవడం గమనార్హం.
Digvijaya Singh: పుల్వామా దాడిని సర్జికల్ స్ట్రైక్స్‌ను మరోసారి తెరపైకి తెచ్చిన కాంగ్రెస్
రాష్ట్ర రుణ పరిమితులను తగ్గించడం, రాష్ట్రాల చట్టసభల పరిధిలోకి ప్రవేశించడం, రాష్ట్ర రుణ పరిమితుల పరిమితుల్లో ఆదాయ, వ్యయ రుణాలను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ విమర్శించారు. పత్రికా స్వేచ్ఛపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఆందోళనను ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఎత్తిచూపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న కొన్ని కేసులను ఆయన ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో ఎక్కడా ప్రభుత్వంతో తనకు ఉన్న విబేధాలను గవర్నర్ ఆరిఫ్ గుర్తు చేయలేదు.