Key Meeting : నవంబర్‌ 3న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక సమావేశం

నవంబర్‌ 3న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన​ఈ సమావేశం జరగనుంది. టీకా పంపిణీపై పలు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించబోతున్నారు.

Key Meeting : నవంబర్‌ 3న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక సమావేశం

Modi

Central Medical Health Department : నవంబర్‌ 3న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన​ ఈ సమావేశం జరగనుంది. టీకా పంపిణీపై పలు రాష్ట్రాల సీఎంలు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. టీకా పంపిణీలో జాతీయ సగటు స్థాయికంటే కంటే తక్కువగా ఉన్న 11 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ పంపిణీపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఆయా రాష్ట్రాల్లో టీకా డోసుల పంపిణీ పెంచడంపై వివరంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు, కేంద్ర ఆరోగ్యమంత్రులు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 40 జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు. నవంబర్‌ నెలాఖరులోపు… ప్రజలందరికీ మొదటి డోస్‌ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Delhi Air Quality : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం!

దీనిపై గతవారమే రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో ప్రధాని సమావేశం నిర్వహించారు. అయినా కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లాంటి రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే కూడా వ్యాక్సినేషన్‌ శాతం తక్కువగా ఉంది.

దాదాపు 11 కోట్ల మంది ప్రజలకు రెండో డోస్‌ వేయడానికి గడువు దాటినా కూడా ముందుకు రాలేదు. దీంతో వీరికి రెండో డోస్‌ వేయడంతోపాటు.. ఇప్పటికీ మొదటి డోసు తీసుకోని వారికి వెంటనే ఇవ్వడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.