Kiara Advani : అప్పుడు చావుని దగ్గర్నుంచి చూశాను.. అదృష్టం వల్ల బతికానేమో..

కియారా తనకి జరిగిన ఆ అనుభవం గురించి మాట్లాడుతూ.. ''కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ తో కలిసి ధర్మశాల టూర్‌ వెళ్లాను. కానీ మంచు ఎక్కువగా కురుస్తుండటంతో నాలుగు రోజుల పాటు హోటల్‌ రూమ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు..............................

Kiara Advani : అప్పుడు చావుని దగ్గర్నుంచి చూశాను.. అదృష్టం వల్ల బతికానేమో..

Kiara Advani

Kiara Advani :  తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ప్రస్తుతం RC15 సినిమా చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘భూల్ భులయ్యా 2’ సినిమా చేసింది. ఈ సినిమా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ కి మంచి విజయాన్ని అందించింది.

ఈ సినిమా విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉంది కియారా అద్వానీ. ఈ సక్సెస్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. ఇంటర్వ్యూలో మీకు దెయ్యాలంటే భయమా అని అడగడంతో కియారా ”నేను దయ్యాలని నమ్మను. దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతున్నప్పుడు చీకటి వల్ల భయపడతాను. అందుకే హారర్ జోనర్‌ సినిమాలు ఎక్కువగా చూడను” అని తెలిపింది.

Nani : హిట్ సినిమాకి ఏడు సీక్వెల్స్ చేయబోతున్నాం.. అందులో నేను కూడా హీరోగా ఒకటి చేస్తానేమో..

ఇదే ఇంటర్వ్యూలో తన గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చావుని దగ్గరగా చూశాను అని షేర్ చేసుకుంది. కియారా తనకి జరిగిన ఆ అనుభవం గురించి మాట్లాడుతూ.. ”కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ తో కలిసి ధర్మశాల టూర్‌ వెళ్లాను. కానీ మంచు ఎక్కువగా కురుస్తుండటంతో నాలుగు రోజుల పాటు హోటల్‌ రూమ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ కూడా లేదు. సరైన ఫుడ్ కూడా లేదు. వేడి కోసం రూమ్‌లో మంట ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఒకరోజు హోటల్ రూమ్ లో అందరం పడుకున్నాక రూమ్ లో ఉన్న ఓ కుర్చీకి నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. మా ఫ్రెండ్ ఒకరు సడెన్ గా లేచి చూస్తే రూమ్ లో మంటలు ఉన్నాయి. దీంతో అందర్నీ లేపి గట్టిగా అరిచాము. బయట నుంచి వచ్చి డోర్ పగలగొట్టి మమల్ని రక్షించారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూశాను అనిపించింది. అదృష్టం కొద్దీ నేను, ఆ రూమ్ లో ఉన్న మా ఫ్రెండ్స్ బతికామేమో అనుకున్నాం” అని తెలిపింది.