Kondapolam : కొండపొలం ట్రైలర్ విడుదల.. ఇది వైష్ణవ్ తేజ్ తిరుగుబాటు

తన మొదటి సినిమా ఉప్పెనతోనే 100కోట్లు కలెక్ట్ చేసి స్టార్ హీరోలకి ధీటుగా నించున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన కథతో, నటనతో మన ముందుకి వచ్చాడు.

Kondapolam : కొండపొలం ట్రైలర్ విడుదల.. ఇది వైష్ణవ్ తేజ్ తిరుగుబాటు

Untitled Design

Kondapolam :  తన మొదటి సినిమా ఉప్పెనతోనే 100కోట్లు కలెక్ట్ చేసి స్టార్ హీరోలకి ధీటుగా నించున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన కథతో, నటనతో మన ముందుకి వచ్చాడు. ఇప్పుడు తాజాగా తన రెండో సినిమా ”కొండపొలం”తో మన ముందుకి రాబోతున్నాడు.

వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రచించిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. రకుల్ ప్రీత్ మొదటి సారిగా గ్రామీణ యువతి పాత్రలో నటించింది.

Akkineni Amala : మళ్ళీ సినిమాల్లోకి అమల.. ఒకేసారి తమిళ్, తెలుగులో రీఎంట్రీ

నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాలు పడకపోవటం వల్ల గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవడానికి గొర్రెలకాపరులు అడవుల్లోకి వెళ్తారు. ఆ అడవిలో వాళ్ళు ఎదుర్కున్న కష్టాలు ఏంటి, హీరో వాటిని ఎలా ఎదుర్కున్నాడు, హీరోయిన్ తో ప్రేమ కథ, గొర్రెల్ని తినేసే పులితో యుద్ధం.. ఇవన్నీ కలగలిపి ఒక గ్రామీణ అడవి నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించారు.

 

Kondapolam

Kondapolam

ఈ సినిమాని అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి యూట్యూబ్ లో మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాతో వైష్ణవ్ మరో హిట్ ని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.