NTR: అదిరిపోయే న్యూస్.. ఎన్టీఆర్ కోసం ఆ బ్యూటీని పట్టుకొస్తున్న కొరటాల..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాన్ని...

NTR: అదిరిపోయే న్యూస్.. ఎన్టీఆర్ కోసం ఆ బ్యూటీని పట్టుకొస్తున్న కొరటాల..?

Koratala Siva Trying To Bring Sai Pallavi On Board For Ntr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టుపై వర్క్ చేస్తున్న కొరటాల, తాజాగా ఈ సినిమాలో తారక్ కోసం ఓ బ్యూటీఫుల్ హీరోయిన్‌ను కూడా పట్టుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడట.

NTR30: మే 20 తారక్ బర్త్ డే.. అదే రోజున కొరటాల మూవీ కంప్లీట్ డిటైల్స్!

తొలుత ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ఆలియా భట్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఇటీవల ఆమె పెళ్లి చేసుకోవడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమా నుండి ఆలియా తప్పుకోవడంతో ఆమె స్థానంలో అందాల భామ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్ వినిపించింది. కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.

NTR: కొరటాలకు ఎన్టీఆర్ ఝలక్..?

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ సాయి పల్లవిని తీసుకువచ్చేందుకు దర్శకుడు కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపేందుకు కొరటాల రెడీ అవుతున్నాడట. అభినయంతో పాటు డ్యాన్స్‌లోనూ ఇరగదీసే సాయి పల్లవి అయితే తారక్ పక్కన చాలా అద్భుతంగా ఉంటుందని కొరటాల భావిస్తున్నాడట. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై అప్పుడే టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తారక్ సరసన సాయి పల్లవి గనక నటిస్తే, వారిద్దరు పోటీపడీ నటించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. మరి నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.