Radheshyam : ప్రభాస్‌కు కచ్చితంగా పెళ్లి జరుగుతుంది.. ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ చెప్పిన కృష్ణంరాజు భార్య
ప్రభాస్, పూజా హెగ్డే తో పాటు చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే ఈ ప్రమోషన్స్ కి మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి కూడా..

Prabhas
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా మార్చ్ 11న రిలీజ్ అవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ జోరు మరింత పెంచారు. ప్రభాస్, పూజా హెగ్డే తో పాటు చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే ఈ ప్రమోషన్స్ కి మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి కూడా ప్రమోషన్స్ లో భాగమవుతున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆవిడ కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూలలో శ్యామల దేవి మాట్లాడుతూ.. ”ప్రభాస్ కు పులస చాప కూర అంటే చాలా ఇష్టం. దానితో ఇష్టంగా భోజనం చేస్తాడు. ప్రభాస్‌కు ఆయన పెద్దనాన్న(కృష్ణం రాజు) అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్న పెద్దనాన్నను కలుస్తూనే ఉంటాడు. కలిసినప్పుడల్లా గంటలు గంటలు మాట్లాడుకుంటారు. ప్రభాస్ ఆయనను పెద్ద బాజీ అని, నన్ను కన్నమ్మ అని పిలుస్తాడు. నేను బాబు అని పిలుస్తాను ప్రభాస్ ని. ప్రభాస్ కి చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. అమ్మాయిల నుంచి మరీ ఎక్కువగా వస్తాయి. కానీ ప్రభాస్‌కు చాలా మొహమాటం. అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గు. అందుకే అప్పుడప్పుడు ఆ ఫోన్ కాల్స్ నేనే లిఫ్ట్ చేసి మాట్లాడతాను.”
Namratha Shirodkar : ఎప్పుడూ మిస్ అవ్వం.. మామయ్య గారు.. కృష్ణపై ఎమోషనల్ పోస్ట్ చేసిన నమ్రత..
”ప్రభాస్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా మాకు ఏ ప్రాబ్లమ్ లేదు. పెళ్లి విషయం వాడి చేతుల్లోనే ఉంది. కానీ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ప్రభాస్ తో పెళ్లి కోసం మా దగ్గరికి వస్తు ఉంటారు. ఇక ప్రభాస్ తో ఫోటో కావాలని చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. ప్రభాస్ ఎంత సక్సెస్ సాధించినా గర్వం ఉండదు. అహంకారాన్ని తలకెక్కించుకోడు.” అంటూ ఇలా ప్రభాస్ కి సంబంధించిన పలు విషయాలని తెలిపారు.