Kukatpally To KoKapet ‘Light Rail’ : త్వరలోనే కూకట్‌పల్లి To కోకాపేట్‌..‘లైట్‌ రైల్‌’ ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్..

రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంది ప్రభుత్వం. దీంతో త్వరలోనే కూకట్‌పల్లి టూ కోకాపేట్‌..‘లైట్‌ రైల్‌’ ఏర్పాటు దిశగా యోచిస్తోంది.

Kukatpally To KoKapet ‘Light Rail’ : త్వరలోనే కూకట్‌పల్లి To కోకాపేట్‌..‘లైట్‌ రైల్‌’ ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్..

Kukatpally To Kokapet Light Rail

Kukatpally to KoKapet ‘Light Rail’ : హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈరోజు సిటీకి దూరం అనుకున్న ప్రాంతం కేవలం కొన్ని నెలల్లోనే హైదరాబాద్ నగరం పరిధిలోకి చేరిపోతోంది. దీంట్లో భాగంగానే ఎన్నో గ్రామ పంచాయితీలు గ్రేటర్ లో చేరిపోయాయి. సిటీలో ఏమూల నుంచి ఏ మూలకైనా ప్రజా రవాణా కూడా మెరుగుపడుతోంది. దీంతో సిటీకి దూరం అయినా స్థలాలు, ఇళ్లు, అపార్ట్ మెంట్స్ కొనటానికి ప్రజలు ఏమాత్రం ఆలోచించటంలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మరో కొత్త ప్రాజెక్టును హైదరాబాద్‌లో చేపట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది.

Read more : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

ఇప్పటికే నగరంలో ఉన్న మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌), హైదరాబాద్‌ మెట్రోరైల్‌ (హెచ్‌ఎంఆర్‌)లతో ప్రజరవాణా సులభంగా మారింది. ఈక్రమంలో మరో కీలక అడుగు వేస్తోంది ప్రభుత్వం. ప్రజారవాణాను మరింతగా మెరుగు పరిచేందుకు ప్రభుత్వం కూకట్ పల్లి టూ కోకాపేటకు ‘లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌’ (ఎల్‌ఆర్‌టీఎస్‌)ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కోకాపేట ఏరియాల్లో అనేక మల్టీ నేషనల్ కంపెనీలున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రజారవాణా సులభతరంగా మారింది మెట్రోరైల్ వల్ల. కానీ రోజు రోజుకు అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ కు మరింత ప్రజా రవాణా అవుసరం అవుతోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వీరంతా ఆఫీసులకు వచ్చి పోయేందుకు ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రస్తుతం ఉన్న రవాణ వ్యవస్థకు అదనంగా మరొకటి తేవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Read more : Unisex Bathroom : వివాదంగా మెక్‌డొనాల్డ్స్‌ ‘టాయిలెట్‌’..స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అధికారులు

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అతి పెద్ద హౌజింగ్‌ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్‌పల్లి నుంచి కోకాపేట వరకు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై హైదరాబాద్‌ యునిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్‌పోర్ట్‌ అథారిటీ (హెచ్‌యూఎంటీఏ)లు డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. హెచ్‌యేఎంటీఏలో హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌లు భాగస్వాములుగా ఉన్నాయి.

ప్రస్తుత అంచనాల ప్రకారం కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర ఎల్‌ఆర్‌టీఎస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మార్గం వల్ల ఒకేసారి కేపీహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ అనుసంధానం అయ్యే అవకాశం ఉంది. నార్సింగి దగ్గర మెట్రో ఫేట్‌ 2 లైన్‌ సైతం టచ్‌ అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.