Kushboo : ‘వారసుడు’లో తన పాత్ర ఎడిటింగ్‌లో తీసేయడంపై స్పందించిన ఖుష్బూ..

వారసుడు సినిమాలో ఖుష్బూ కూడా నటించింది. షూటింగ్ లొకేషన్ నుంచి ఖుష్బూ వర్కింగ్ స్టిల్స్ కూడా చిత్రయూనిట్ షేర్ చేశారు. కానీ ఎడిటింగ్ లో ఖుష్బూ పాత్రని కట్ చేయడంతో సినిమాలో అసలు ఖుష్బూ కనపడలేదు.

Kushboo : ‘వారసుడు’లో తన పాత్ర ఎడిటింగ్‌లో తీసేయడంపై స్పందించిన ఖుష్బూ..

Khushboo reacts on editing of her role in Varasudu

Kushboo :  ఒకప్పటి తెలుగు, తమిళ స్టార్ నటి ఖుష్బూ ఇప్పుడు అమ్మ, అత్త పాత్రలు, స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తోంది. త్వరలో ఖుష్బూ రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్(Gopichand), డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో మే 5న రాబోతున్న ఈ సినిమాలో ఖుష్బూ ఓ ముఖ్య పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను తెలిపింది.

ఇటీవల తమిళ్ స్టార్ హీరో విజయ్ సంక్రాంతికి వారసుడు సినిమాతో తెలుగు, తమిళ్ లో ప్రేక్షకుల ముందుకి రాగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ఖుష్బూ కూడా నటించింది. షూటింగ్ లొకేషన్ నుంచి ఖుష్బూ వర్కింగ్ స్టిల్స్ కూడా చిత్రయూనిట్ షేర్ చేశారు. కానీ ఎడిటింగ్ లో ఖుష్బూ పాత్రని కట్ చేయడంతో సినిమాలో అసలు ఖుష్బూ కనపడలేదు. దీనిపై ఖుష్బూ అభిమానులు ఫైర్ అయ్యారు కూడా. తాజాగా రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ దీనిపై స్పందించింది.

Manju Warrier : బైక్ పై లాంగ్ రైడింగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్..

వారసుడు సినిమాలో తన పాత్రని ఎడిటింగ్ లో తీసేయడంపై ఖుష్బూ మాట్లాడుతూ.. గతంలో కంటే ఇప్పటి ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నటీనటుల కంటే పాత్రల్నే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. హీరోయిన్ గా చాలా సినిమాలు చేసేశాను. ఇప్పుడు చిన్న పాత్ర అయినా సరే మంచిది చేయాలని ఫిక్స్ అయి చేస్తున్నాను. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ కి అమ్మగా నటించాను. అది వర్కౌట్ అవ్వలేదు. ఇటీవల విజయ్ వారసుడు సినిమాలో నటించాను. అందులో దాదాపు నా క్యారెక్టర్ 18 నిమిషాలు ఉంటుంది. ఎంతో ఖర్చుపెట్టి ఆ సీన్స్ ని తీశారు. కానీ సినిమా మొత్తంలో ఆ సన్నివేశాలు అంతగా రాకపోవడంతో ఎడిటింగ్ లో తీసేశారు. కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది, దానికి మనం ఏమి చేయలేం. ఇప్పుడు రామబాణంలో కుటుంబం కోసం నిలబడే మహిళగా మంచి పాత్ర చేశాను అని తెలిపింది.