Acharya : బాబులందరూ బిజీ బిజీ..

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూట్ ముంబయ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం లంకేశ్వరుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌పై సీన్స్ షూట్ చేస్తున్నారు..

Acharya : బాబులందరూ బిజీ బిజీ..

Acharya

Acharya: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూట్ ముంబయ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం లంకేశ్వరుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌పై చిత్రీకరణ జరుగుతుంది.

Adipurush : ‘ఆదిపురుష్’ ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్..!

చిరంజీవి, రామ్ చరణ్ – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కోకాపేట్‌లో జరుగుతుంది. చరణ్‌పై సాంగ్ షూట్ చేస్తున్నారు.

Acharya
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ హైదరాబాద్ పఠాన్‌చెరువు కాలనీలో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాలను ఈ షెడ్యుల్‌లో కంప్లీట్ చేయబోతున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ భూత్‌బంగ్లాలో జరుగుతుంది.
రవితేజ, శరత్ మండవ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘రామారావు – అన్ డ్యూటీ’ షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతోంది.

Mahesh Babu

నాగార్జున – ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ వేస్ట్ మారేడుపల్లిలో జరుగుతుంది. నాని నటిస్తున్న ‘అంటే..సుందరానికి’ మూవీ షూటింగ్ మాదాపూర్‌లో జరుగుతుంది. ‘ఎఫ్3’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో.. వరుణ్ తేజ్ ‘గని’ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
రామ్ పోతినేని, లింగు స్వామి కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.

Nandamuri Balakrishna

గోపీచంద్ – మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా హైదరాబాద్‌లో జరుగుతుంది. సమంత, గుణ శేఖర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘శాకుంతలం’ సినిమా అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతుంది. బాలకృష్ణ – బోయపాటిల హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ రీసెంట్ షెడ్యూల్ తమిళ్‌నాడులోని కుంభకోణంలో జరుగనుంది.