Prabhas : ప్రభాస్ ‘సలార్’ సినిమా లీకులు.. షాక్ అయిన నిర్మాతలు

ఇటీవల 'పుష్ప' సినిమా నుంచి కూడా వరుసగా కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. తాజాగా ప్రభాస్ 'సలార్' సినిమా నుంచి కూడా చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది.

Prabhas : ప్రభాస్ ‘సలార్’ సినిమా లీకులు.. షాక్ అయిన నిర్మాతలు

Salaar

Prabhas :  ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా ఉన్నాడు. వరుస సినిమాలని లైన్లో పెట్టాడు. కానీ ఏ సినిమా నుంచి కూడా సరైన అప్డేట్ ఇవ్వట్లేదు. ‘సాహో’ సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ప్రభాస్ సినిమాల నుంచి పోస్టర్లే తప్ప టీజర్లు, ట్రైలర్లు, పాటలు లాంటివి ఏమి రాలేదు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అసహనంగా ఫీల్ అవుతున్నారు. ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి అయింది. రిలీజ్ కి రెడీగా ఉంది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఆ సినిమా నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేదు.

ఇలా ప్రభాస్ మాత్రమే కాదు చాలా మంది స్టార్ హీరోలు సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. కరోనాతో ఇది మరింత ఎక్కువైంది. ఇలాంటి సమయంలో రాబోయే సినిమాల నుంచి చిన్న చిన్న వీడియోలు లీక్ అవుతున్నాయి. కొంతమంది సినిమా ఫుటేజ్ నుంచి లేదా షూటింగ్ జరిగే సమయంలో వీడియో తీసి లీక్ చేస్తున్నారు. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకంగా సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అవుతున్నాయి. ఈ బాధ ఎప్పట్నుంచో పరిశ్రమకి ఉంది. ఇటీవల ‘పుష్ప’ సినిమా నుంచి కూడా వరుసగా కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. లీక్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రభాస్ ‘సలార్’ సినిమా నుంచి కూడా చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది.

TFCC elections : తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్నికలు.. ఈ ఎన్నికలు ఎలా ఉంటాయో?

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ గా తెరకెక్కుతుంది ‘స‌లార్‌’. త్వరలో ప్ర‌భాస్ పుట్టిన‌రోజు ఉండటంతో ఈ సినిమా నుంచి ఏదైనా లుక్ లేదా టీజ‌ర్ రిలీజ్ చేస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ లోపే లీకేజీ వీరులు లొకేష‌న్‌లో చిత్రీక‌రించిన వీడియోను ఆన్ లైన్‌లో లీక్ చేసి ‘స‌లార్‌’ నిర్మాత‌ల‌కు షాకిచ్చారు. ‘స‌లార్‌’ మూవీ సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడి నుంచే ఈ వీడియో లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిర్మాతలు మరోసారి ఇలా జరగకూడదని ఇంకా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.