Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించని మహిళా అభ్యర్థులు.. 5% టికెట్లు కూడా ఇవ్వని రాజకీయ పార్టీలు

కర్ణాటకలో ఏ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో మహిళా నాయకులు లేరు. పార్టీ అధినేతలంతా పురుషులే. అయితే టికెట్ల పంపిణీలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. మహిళా అభ్యర్థుల్ని పోటీలో దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించని మహిళా అభ్యర్థులు.. 5% టికెట్లు కూడా ఇవ్వని రాజకీయ పార్టీలు

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. 224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మహిళా అభ్యర్థులు కనీసం అసెంబ్లీ స్థానాలున్న సంఖ్యలో కూడా కనిపించడం లేదు. మొత్తంగా 184 మంది మహిళలు మాత్రమే పోటీకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 219 మంది మహిళలు పోటీ చేయగా ఈసారి ఆ సంఖ్య మరింత తగ్గింది. ఇక పురుష అభ్యర్థుల సంఖ్య సైతం స్వల్పంగా తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,436 మంది పోటీ చేయగా.. ఈసారి 2,427 మంది పోటీలో ఉన్నారు.

Karnataka Polls: కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలని కమల్ హాసన్‭కు విజ్ణప్తులు

కర్ణాటకలో ఏ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో మహిళా నాయకులు లేరు. పార్టీ అధినేతలంతా పురుషులే. అయితే టికెట్ల పంపిణీలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. మహిళా అభ్యర్థుల్ని పోటీలో దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసేందుకు సైతం మహిళలు ముందుకు రాలేని పరిస్థితి కర్ణాటకలో కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అతి తక్కువ శాతమే ఉన్న మహిళా అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువలో ఎక్కువ 15 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపుతోంది. అధికార పార్టీ బీజేపీ నుంచి కేవలం ఆరుగురే బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మూడవ పెద్ద పార్టీ అయిన జేడీఎస్ నుంచి కేవలం నలుగురు మహిళలకే టికెట్ దక్కింది.

Satyapal Malik: విపక్షాలన్ని కలిసి పుల్వామా దాడి మీద మాట్లాడితే మోదీ ప్రభుత్వం కూలిపోతుందట

సంక్షేమంలో మహిళలకు సగం వాటా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణంపై కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. అలాగే మహిళలకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించింది. ఇక జేడీఎస్ కూడా మహిళలకు స్వయం సహాయక గ్రూపుల రుణాలు మాఫీ చేస్తామని, గర్భిణీ మహిళలకు ఆరు నెలల పాటు నెలకు 6,000 రూపాయల సహాయం ఇస్తామని హామీలు ఇచ్చింది. కోట్ల రూపాయలు మహిళల మీద ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్న రాజకీయ పార్టీలు.. ఎన్నికల్లో మాత్రం మహిళల్ని బరిలోకి దింపేందుకు వెనకాడుతున్నాయి.

1952 నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్న మహిళా అభ్యర్థులు, అందులో గెలుపొందిన వారి జాబితా చూసుకుంటే..
మైసూరు శాసన సభ ఎన్నికలు
1952: 3 విజేతలు
1957: 24 మంది అభ్యర్థులు, 13 మంది విజేతలు
1962: 30 మంది అభ్యర్థులు, 18 మంది విజేతలు
1967: 9 మంది అభ్యర్థులు, 5 మంది విజేతలు
1972: 24 మంది అభ్యర్థులు, ఎవరూ గెలవలేదు

కర్ణాటక శాసన సభ ఎన్నికలు
1978: 30 మంది అభ్యర్థులు, 8 మంది విజేతలు
1983: 34 మంది అభ్యర్థులలు, ఒకరే గెలిచారు
1985: 108 మంది అభ్యర్థులు, 8 మంది విజేతలు
1989: 78 మంది అభ్యర్థులు, 10 మంది విజేతలు
1994: 117 మంది అభ్యర్థులు, 7 మంది విజేతలు
1999: 62 మంది అభ్యర్థులు, 6 మంది విజేతలు
2004: 101 మంది అభ్యర్థులు, 6 మంది విజేతలు
2008: 107 మంది అభ్యర్థులు, 3 మంది విజేతలు
2013: 175 మంది అభ్యర్థులు, 6 మంది విజేతలు
2018: 219 మంది అభ్యర్థులు, 7 మంది విజేతలు