SSMB 28 : ఎట్టకేలకు మహేష్ త్రివిక్రమ్ సినిమా మొదలు.. ఆగస్టు‌లో షూట్..

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మహేష్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ 28వ సినిమా మొదలవ్వబోతుంది. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

SSMB 28 : ఎట్టకేలకు మహేష్ త్రివిక్రమ్ సినిమా మొదలు.. ఆగస్టు‌లో షూట్..

Ssmb 28

SSMB 28 :  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ తో, రాజమౌళితో రెండు సినిమాలు అన్నౌన్స్ చేశాడు కానీ ఆ రెండు సినిమాలు ఇప్పటివరకు మొదలు కాలేదు. అసలు సినిమాల ఊసెత్తకుండా మహేష్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు నెల రోజుల నుంచి. మహేష్ వస్తే కానీ త్రివిక్రమ్ సినిమా మొదలవ్వదు. ఈ లోపు త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ అభిమానులు కూడా మహేష్ బాబు తొందరగా వచ్చి షూట్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Priya Anand : నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకుంటాను అంటున్న హీరోయిన్

ఎట్టకేలకు ఈ షూట్ మొదలవ్వబోతుంది. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మహేష్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ 28వ సినిమా మొదలవ్వబోతుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సంవత్సరం చివరికి సినిమా షూట్ పూర్తి చేసి 2023 వేసవిలో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే మరోసారి నటించనుంది. తమన్ సంగీతం ఇవ్వనున్నాడు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.