Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట గ్లింప్స్‌తో సూపర్ స్టార్ కు విషెస్!

మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్ డేట్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన అభిమానులను కూడా సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కావడంతో మరోసారి అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట గ్లింప్స్‌తో సూపర్ స్టార్ కు విషెస్!

Mahesh Special Wishes To Krishna With Sarkaru Vaari Paata Glimpse

Sarkaru Vaari Paata: మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్ డేట్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన అభిమానులను కూడా సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కావడంతో మరోసారి అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ప్రకటించి తండ్రికి మంచి గిప్ట్ ఇచ్చారు.

ప్రతి పుట్టినరోజు లాగానే ఈ సారి కూడా తన కొత్త సినిమా సర్కారు వారి పాట టీజర్ తో తండ్రికి స్పెషల్ శుభాకాంక్షలు చెప్పనున్నారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ లో టీజర్ ను క‌ట్ చేసేంత ఫుటేజ్ లేకపోవడంతో యూనిట్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ సినిమా నుండి 30 సెక‌న్ల‌ గ్లింప్స్‌ని క‌ట్ చేసి సూపర్ స్టార్ కృష్ణకు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కాగా.. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమా మీద భారీ క్రేజ్ నెలకొనేలా చేసింది. ఇప్పుడు విడుదల చేయబోయే గ్లింప్స్ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచేలా ఉండాలని దర్శకుడు పరుశురాం ప్లాన్ చేస్తున్నాడు. మరి అభిమానులను ఈ గింప్స్ ఎంత మెస్మరైజ్ చేస్తుందో చూడాలి!