Mahua Moitra: కాళీ మాత వివాదం.. మహువా మొయిత్రాపై సొంత పార్టీ నేతల విమర్శలు

లీనాకు మద్దతుగా మహువా మాట్లాడుతూ ‘‘నాకు సంబంధించినంత వరకు కాళీ మాత మద్యం, మాంసాలను స్వీకరించే దేవత మాత్రమే. మీ దేవతను మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవతలకు మద్యాన్ని కూడా నైవేద్యంగా అందిస్తారు’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించింది.

Mahua Moitra: కాళీ మాత వివాదం.. మహువా మొయిత్రాపై సొంత పార్టీ నేతల విమర్శలు

Mahua Moitra

Mahua Moitra: కాళీ మాతపై ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్‌సీ) పార్టీ ఎంపీ మహువా మొయిత్రా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దర్శకురాలు లీనా మణిమేకలై రూపొందించిన కాళీ మాత వివాదాస్పద పోస్టర్‌కు మహువా మొయిత్రా మద్దతు ప్రకటించారు. లీనాకు మద్దతుగా మహువా మాట్లాడుతూ ‘‘నాకు సంబంధించినంత వరకు కాళీ మాత మద్యం, మాంసాలను స్వీకరించే దేవత మాత్రమే. మీ దేవతను మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవతలకు మద్యాన్ని కూడా నైవేద్యంగా అందిస్తారు’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించింది.

Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్

లీనా రూపొందించిన పోస్టర్‌లో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. దీంతో మహువా మొయిత్రాపై కూడా విమర్శలు మొదలయ్యాయి. హిందూ దేవతల్ని కించపర్చడంపై బీజేపీ సహా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అనూహ్యంగా సొంత పార్టీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సాధారణంగా బీజేపీ ఏం చేసినా, దానికి వ్యతిరేకంగా ఉండే సొంత పార్టీ నేతలకు మద్దతిచ్చే టీఎమ్‌సీ నాయకులు ఈ విషయంలో మాత్రం మహువాకు మద్దతుగా నిలబడటం లేదు. టీఎమ్‌సీ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్.. మహువా వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాళీ మాత అంటే ఎంత ఇష్టమో బెంగాల్ ప్రజలందరికీ తెలుసు. ఆ భావాల్ని ఎవరూ తుడిచేయలేరు’’ అంటూ తమ పార్టీ అధినేత్రికి కాళీ మాతపై ఉన్న ఇష్టాన్ని చెబుతూ, కాళీ మాతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టింది.

Salman Khan: కృష్ణజింక కేసులో సల్మాన్‌ను క్షమించం: లారెన్స్ వెల్లడి

మరో టీఎమ్‌సీ సీనియర్ నేత సౌగతా రాయ్ మాట్లాడుతూ ‘కాళీ మాత, పోస్టర్ గురించి మహువా చేసిన వ్యాఖ్యలు సరికావు. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు’’ అన్నారు. సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ మహువాకు ఈ విషయంలో మద్దతు ఇవ్వలేనన్నారు. మరోవైపు మహువా మొయిత్రాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.