Suchetha Sathish : 7 గంటలు.. 120 భాషలు.. 16ఏళ్ల అమ్మాయి ప్రపంచ రికార్డు

వయసు 16 ఏళ్లు. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ చదువుకునే వయసు. కానీ అపారమైన టాలెంట్ ఆ అమ్మాయి సొంతం. 16ఏళ్లకే అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ రికార్డు సృష్టించింది. గిన్నిస్ బుక్ రికార్

Suchetha Sathish : 7 గంటలు.. 120 భాషలు.. 16ఏళ్ల అమ్మాయి ప్రపంచ రికార్డు

Suchetha Sathish

Suchetha Sathish : వయసు 16 ఏళ్లు. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ చదువుకునే వయసు. కానీ అపారమైన టాలెంట్ ఆ అమ్మాయి సొంతం. 16ఏళ్లకే అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ రికార్డు సృష్టించింది. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..

16ఏళ్ల సుచేత సతీశ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. 7 గంటల 20 నిమిషాల్లో 120 భాషల్లో పాటలు పాడింది. ఆగస్టు 19న దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో సుచేత ఈ ఫీట్ సాధించింది. తాజాగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు సరిఫికెట్ అందచేశారు. కేరళకు చెందిన సుచేత తల్లిదండ్రులు దుబాయ్ లో స్థిరపడ్డారు. సుచేత ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. మూడేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకుంటోంది.

”మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్” పేరుతో ఆగస్టు 19న దుబాయ్ లో సుచేత కన్సర్ట్ నిర్వహించింది. 7 గంటల 20 నిమిషాల పాటు పాటలు పాడింది. అదీ 120 భాషల్లో. ఆమె టాలెంట్ ని గిన్నిస్ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. గిన్నిస్ లో చోటు కల్పించారు. కాగా, ఈ క్రమంలో సుచేత గత రికార్డును బ్రేక్ చేసింది. గతంలో(2008) భారత్ కు చెందిన కేసిరాజు శ్రీనివాస్ 76 భాషల్లో పాటలు పాడారు. ఇప్పటివరకు అదే రికార్డు. ఆ రికార్డును 16ఏళ్ల సుచేత బద్దలుకొట్టింది.

సుచేత పాడిన 120 భాషల్లో 29 భాషలు భారత్ కు చెందినవి. మిగతా 91 భాషలు ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందినవి. మధ్యాహ్నం 12 గంటలకు సుచేత తన ప్రయత్నం ప్రారంభించింది. ముందుగా సంస్కృతంలో పాడింది. మలయాళ సినిమా Dhwani లోని Janaki Jane పాట పడింది. చివరగా తన తల్లి సుమితా అల్లియాత్ రాసిన హిందీ పాట పాడింది. బాలీవుడ్ కంపోజర్ మాంటీ శర్మ ఈ పాటను కంపోజ్ చేశారు. దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో ఈ ప్రొగ్రామ్ నిర్వహించారు.

సుచేతా తండ్రి డాక్టర్ టీసీ సతీష్ డెర్మటాలజిస్ట్. దుబాయ్ లోని యూనికేర్ మెడికల్ సెంటర్ లో డాక్టర్ గా పని చేస్తారు. సుచేత తల్లిదండ్రులది కేరళలోని కన్నూర్ స్వస్థలం. 12ఏళ్ల వయసులోనే సుచేత 102 భాషల్లో పాటలు పాడి సంగీతకారుల దృష్టిలో పడింది. మూడేళ్ల వయసు నుంచే సుచేత సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేసింది.