Congress : కాంగ్రెస్ లో కొత్త కుంపటి.. సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన సిద్దు సలహాదారు

కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ను 'అలీబాబా 40 దొంగలు'గా వర్ణిస్తూ సిద్ధూ సలహాదారుడు మల్‌విందర్‌ సింగ్‌ మాలీ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

Congress : కాంగ్రెస్ లో కొత్త కుంపటి.. సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన సిద్దు సలహాదారు

Congress

Congress : పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌-పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూల మధ్య వివాదం కొనసాగుతుంది. కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ను ‘అలీబాబా 40 దొంగలు’గా వర్ణిస్తూ సిద్ధూ సలహాదారుడు మల్‌విందర్‌ సింగ్‌ మాలీ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్‌ ప్రభుత్వంలోని మంత్రి విజయ్‌ ఇందర్‌ సింగ్‌లాను 40 దొంగల్లో ఒకరుగా పేర్కొన్నాడు.

కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు అసంతృప్త నేతలంతా ఒక్కటవుతున్నారు. అమరీందర్‌పై నలుగురు క్యాబినెట్‌ మంత్రులు, 25 మంది వరకు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. సిద్ధూ వర్గానికి చెందిన మంత్రి తృప్త్‌ రాజేంద్రసింగ్‌ బాజ్వా ఇంట్లో మంగళవారం సమావేశమయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు.

అమరీందర్‌పై తమకు విశ్వాసం లేదని ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని పార్టీ హైకమాండ్‌కు తెలియజేయాలని నిర్ణయించారు. అయితే నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేయనుంది.

మరోవైపు అమరీందర్‌ విధేయులైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధూపై విరుచుకుపడుతున్నారు. పాకిస్థాన్‌, కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధూ సలహాదారులను తొలిగించాలని డిమాండ్‌ చేశారు.