West Bengal: కుమారుడిని చెరువులో ముంచి చంపిన తండ్రి Man kills son by drowning him in pond

West Bengal: కుమారుడిని చెరువులో ముంచి చంపిన తండ్రి

కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కుమారుడిని ఘోరంగా చంపాడో తండ్రి. క‌న్న కొడుకును చెరువులో ముంచి చంపేసి, అనంత‌రం ఇంటికి వ‌చ్చి త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్లు న‌టించాడు.

West Bengal: కుమారుడిని చెరువులో ముంచి చంపిన తండ్రి

West Bengal: కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన కుమారుడిని ఘోరంగా చంపాడో తండ్రి. క‌న్న కొడుకును చెరువులో ముంచి చంపేసి, అనంత‌రం ఇంటికి వ‌చ్చి త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్లు న‌టించాడు. పిల్లాడి కోసం కుటుంబ స‌భ్యులు అంద‌రూ వెతుకుతుండ‌గా ఆ తండ్రి మాత్రం ద‌ర్జాగా ఇంటి వ‌ద్దే ఉండిపోయాడు. చివ‌ర‌కు ఆరేళ్ల బాలుడు చెరువులో విగ‌తజీవిగా క‌న‌ప‌డ్డాడు.

Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ

దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌గా ఆ పిల్లాడిని తండ్రే హ‌త్య చేశాడ‌ని తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాల‌ను పోలీసులు శ‌నివారం మీడియాకు తెలిపారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని ద‌క్షిణ 24 ప‌ర‌గ‌ణాల జిల్లాలోని గోస‌బాలోని ప‌ఠాన్‌ఖ‌లి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆరేళ్ల త‌మ బాలుడు క‌న‌ప‌డ‌డం లేదంటూ ఆ కుటుంబంలోని స‌భ్యులు అంద‌రూ గ్రామంలో వెతికి, చెరువులో అత‌డి మృత‌దేహాన్ని గుర్తించారు.

Ukraine: డాన్‌బాస్‌లో ర‌ష్యా బ‌ల‌గాల‌ను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్‌

అదే స‌మ‌యంలో ఆ బాలుడి తండ్రి ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా పారిపోయాడు. చివ‌ర‌కు పోలీసులు బాలుడి తండ్రిని భాంగోఢ్ ప్రాంతంలో అరెస్టు చేసి, విచారించారు. త‌న కుమారుడిని తానే చంపాన‌ని అంగీక‌రించాడు. నిందితుడికి, అత‌డి భార్యకు మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని, ఆమె వేరే ప్రాంతంలో నివ‌సిస్తోంద‌ని పోలీసులు తెలిపారు. వారి కుమారుడు తండ్రి వ‌ద్దే ఉంటున్నాడ‌ని వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే కుమారుడిని ఆ తండ్రి హ‌త్య చేశాడ‌ని చెప్పారు.

×