Satyapal Malik: రామమందిరంపై దాడి లేదంటే బీజేపీ అగ్ర నేతను చంపడం.. మోదీ ఇంతకు తెగిస్తారంటూ దుమారం రేపిన సత్యపాల్ మాలిక్

నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించలేరని, అందుకే ఇప్పుడే రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన సలహా ఇచ్చారు.

Satyapal Malik: రామమందిరంపై దాడి లేదంటే బీజేపీ అగ్ర నేతను చంపడం.. మోదీ ఇంతకు తెగిస్తారంటూ దుమారం రేపిన సత్యపాల్ మాలిక్

Updated On : July 31, 2023 / 4:47 PM IST

Satyapal Malik on Modi and BJP: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ మైలేజీని పొందేందుకు ఆ ఇద్దరూ (పీఎం మోదీ, బీజేపీ) ఎంతకైనా తెగిస్తారని ఆయన పేర్కొన్నారు. తాజాగా న్యూస్‌క్లిక్‌ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ రాజకీయ మైలేజీని పొందడం కోసం తన దుర్మార్గపు వ్యూహంలో భాగంగా రామ మందిరంపై దాడి చేయడమో లేదంటే బీజేపీకి చెందిన అగ్ర నాయకుడిని చంపేంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రధాని మోదీ అంటూ దుమారానికి తెరలేపారు.

2024 Elections: ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.. 2024లో ఎన్డీయేకు ఒక్క సీటు కూడా రాదట

ప్రధాని మోదీ క్రూరమైన ఎన్నికల వ్యూహంపై విరుచుకుపడిన మాలిక్.. 2019 పుల్వామా దాడిని కూడా ప్రస్తావించారు. ఈ దాడిని ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలను నిర్వహించగల సామర్థ్యం ఉన్న ఎవరైనా రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ఏదైనా చేస్తారంటూ ఆయన అన్నారు. నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించలేరని, అందుకే ఇప్పుడే రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన సలహా ఇచ్చారు.

Tamil nadu Court : 35 ఏళ్లనాటి కేసు,ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలుశిక్ష, రూ.3.32 కోట్ల జరిమానా

అంతకుముందు, పుల్వామా దాడిపై మౌనం వహించాలని తనను కోరారని కొద్ది రోజుల క్రితం ది వైర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ వాదించారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ తమ సిబ్బందిని తీసుకెళ్లేందుకు విమానం కావాలని కోరిందని, అయితే రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించిందని ఆయన చెప్పారు. 2019లో దాడి జరిగినప్పుడు మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు. మణిపూర్ హింసను కూడా ఆయన ప్రస్తావించారు. దుర్మార్గులకు ఆయుధాలు అందించడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.

Kanhaiya Kumar: హీరోయిన్ దీపికా పదుకుణే వేసుకునే బట్టలపైనే నీ దృష్టి.. అంతేగానీ..: కన్నయ్య కుమార్

అయితే ఈ ప్రకటనను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారని ప్రశ్నించగా.. హింసలో ఉపయోగించే ఆయుధాలు సామాన్యులకు అంత తేలికగా అందుబాటులో ఉండవని అన్నారు. ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు మార్కెట్లో అందుబాటులో లేవని, ప్రభుత్వ పదాతిదళంలో ఉన్నాయని ఆయన ఉదహరించారు. అయితే మణిపూర్‌లో భద్రతా దళాల నుంచి ఆయుధాలను కుకీ తీవ్రవాదులు దోచుకున్నారనే వాదనలను సత్యపాల్ మాలిక్ తోసిపుచ్చారు.