Megha Akash: జస్ట్ గ్యాప్ ఇచ్చా.. ఇకపై ప్రయోగాలతో వస్తా!

నితిన్ లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చబ్బీ గర్ల్ మేఘ ఆకాష్ ఆ తర్వాత చల్ మోహన రంగా సినిమా చేసింది. కానీ, ఆ రెండు సినిమాలు అమ్మడికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో తమిళంలో అడుగుపెట్టి అక్కడ వరస అవకాశాలు దక్కించుకుంది. తమిళంలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన మేఘా ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.

Megha Akash: జస్ట్ గ్యాప్ ఇచ్చా.. ఇకపై ప్రయోగాలతో వస్తా!

Megha Akash

Megha Akash: నితిన్ లై సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చబ్బీ గర్ల్ మేఘ ఆకాష్ ఆ తర్వాత చల్ మోహన రంగా సినిమా చేసింది. కానీ, ఆ రెండు సినిమాలు అమ్మడికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో తమిళంలో అడుగుపెట్టి అక్కడ వరస అవకాశాలు దక్కించుకుంది. తమిళంలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన మేఘా ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మేఘా నటించిన రాజరాజచోర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

వైవిధ్య కథలను ఎంపిక చేసుకొని సినిమాలు చేసే శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన రాజరాజచోర సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా యూనిట్ కూడా ప్రమోషన్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన మేఘా ఆకాష్ పలు విషయాలను పంచుకుంది. చల్ మోహన రంగ సినిమా తర్వాత గ్యాప్ వచ్చిన మాట నిజమే కానీ సరైన కథలు రాకపోవడంతో తమిళంలో సినిమాలు ఒప్పుకున్నానని చెప్పింది. తనకు సినిమాల ఎంపికలో బాషా బేధం అసలే లేదన్న మేఘా కథాబలం ఉంటే ఏ భాషలోనైనా సినిమాలు చేస్తానని చెప్పింది.

ఇప్పుడు అన్ని భాషల్లో మంచి సినిమాలు వస్తున్నాయని.. ఇకపై తాను కూడా ప్రయోగాత్మక సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉంటానని చెప్పింది. రాజరాజచోర సినిమాలో కూడా తనకు నిజజీవితంలో పూర్తి వైవిధ్యమైన పాత్ర చేస్తున్నానని చెప్పింది. కాగా మేఘా ప్రస్తుతం తెలుగులో రాజరాజచోర, మనుచరిత్ర, గుర్తుందా శీతాకాలం, డియర్ మేఘా సినిమాలు చేస్తుండగా తమిళంలో యాదుం ఊరే యావరుమ్ కేళిర్ సినిమాతో పాటు తమిళ, తెలుగు బాషలలో తెరకెక్కే అక్టోబర్ 31st లేడీస్ నైట్ సినిమాలు చేస్తుంది.