Hyderabad development: కిషన్ రెడ్డి గారూ.. రక్షణశాఖ భూములు ఇప్పించరూ: మంత్రి కేటీఆర్

భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా కలిసి పనిచేద్దామని కేటీఆర్ అన్నారు

Hyderabad development: కిషన్ రెడ్డి గారూ.. రక్షణశాఖ భూములు ఇప్పించరూ: మంత్రి కేటీఆర్

Ktr

Hyderabad development: భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా అందరం కలిసి పనిచేద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని షేక్పేట్ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(SRDP)లో భాగంగా.. రూ.6 వేల కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్ నగరంలో రోడ్లు ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం SRDP, HRDCL ద్వారా లింకు రోడ్లు.. CRMP పథకంలో భాగంగా ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తున్నామని .. దాంతో ట్రాఫిక్ సమస్యకు చాలావరకూ పరిష్కారం ఏర్పడుతుందని వివరించారు. రూ. 100 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం ఎల్ఈడి లైటింగ్ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

Also read: AP CM Jagan: మంచి చేస్తా ఉంటే విమర్శించే వాళ్ళు వున్నారు: సీఎం జగన్

రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థకు చేయూత నిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందన్న మంత్రి కేటీఆర్..హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలని కోరారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను మూసివేస్తున్నారని వాటిని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. SRDPలో భాగంగా హైదరాబాద్ నగరంలోకి వచ్చే ఎనిమిది ప్రధాన జాతీయ రహదారులపై భారీ ఫ్లైఓవర్ నిర్మాణాలు చేస్తున్నామని అందుకోసం.. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న రక్షణశాఖ భూములు అవసరం అవుతుండగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాటిని ఇప్పించే విధంగా సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉప్పల్ నుండి నారపల్లి వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మాణపనులు కొనసాగుతుండగా, ఫ్యాట్నీ నుంచి కొంపల్లి వరకు, జూబ్లీబస్ స్టేషన్ నుంచి తుర్కపల్లి వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్లాన్ చేశామని కేటీఆర్ తెలిపారు

Also Read: PM Kisan Samman Nidhi : రైతులకు నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ