AP CM Jagan: మంచి చేస్తా ఉంటే విమర్శించే వాళ్ళు వున్నారు: సీఎం జగన్

రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నా, కొంతమంది అడ్డుకుంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు

AP CM Jagan: మంచి చేస్తా ఉంటే విమర్శించే వాళ్ళు వున్నారు: సీఎం జగన్

Jagan

AP CM Jagan: రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నా, కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని అన్నారు. నూతన సంవత్సర కానుకగా ఈరోజు నుండి రూ.2500 పెన్షన్ ఇస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. దేశంలో అత్యధిక పించెను ఇస్తున్న రాష్ట్రం ఏపీనేనని, ప్రతి సంవత్సరం ఇలానే పెంచుకుంటా పోతామని జగన్ అన్నారు. గత ప్రభుత్వం రూ. 400 కోట్ల పెన్షన్ మాత్రమే పంపిణీ చేసిందన్న సీఎం, తమ ప్రభుత్వం రూ. 1,450 కోట్లు పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. లంచాలకు తావు లేదు, జన్మభూమి కమిటీలు అసలే లేవని ప్రతిపక్షపార్టీలనుద్దేశించి చురకలంటించారు.

Also read: PM Kisan Samman Nidhi : రైతులకు నిధులు విడుదల చేసిన ప్రధాని మోడీ

రాష్ట్ర ప్రజలకు ఇంత మంచి చేస్తున్నా, కొంతమంది గిట్టని నేతలు అడ్డుకుంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సినిమా టిక్కెట్ ధరలపై రకరకాలుగా మాట్లాడుతున్నారని.. పేదలకు వినోదాన్ని చేరువ చేసేందుకే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించినట్లు జగన్ పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలం ఇస్తామంటే కులాలమతాల ప్రస్తావన తెచ్చి కోర్టుస్టే తెచ్చుకున్నారని.. ఇటువంటి వారు పేదవారికి శత్రువులు కాదా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి వారికి ఇప్పటికైనా నూతన సంవత్సరంలో మంచి జ్ఞానం, బుద్ది రావాలని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు

Also Read: Wine Shop :ఏపీ ఖజానాకు కాసులవర్షం.. ఉన్నదంతా తాగేశారు.. షాపుల ముందు నో స్టాక్ బోర్డులు!