Wine Shop :ఏపీ ఖజానాకు కాసులవర్షం.. ఉన్నదంతా తాగేశారు.. షాపుల ముందు నో స్టాక్ బోర్డులు!
ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31రోజున రాష్ట్రంలో రూ.124 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు చెబుతున్నాయి.

Wine Shop
Wine Shop : 2021కి గుడ్‌బై చెప్పి కొత్త ఆశలతో 2022ని అహ్వాహించారు ప్రజలు. ఎవరి రేంజ్ లో వారు డిసెంబర్ 31ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. వైన్ షాపులు, బేకరీల ముందు ప్రజలు బారులు తీరారు. ఇక పబ్‌ల సంగతి చెప్పనక్కర్లేదు. డీజీ మోతలు, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేకలతో కొత్తసంవత్సరం తలుపులు తెరిచారు. ఇక కొత్త ఏడాది తెలుగు రాష్ట్రాలకు మద్యం రూపంలో ఖజానాకు కనకవర్షం కురిసింది. డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణం దారులు భారీగా స్టాక్ దింపినా.. మద్యం ప్రియుల దెబ్బకు షాపుల ముందు ఏంటీ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదవండి : Telangana Liquor : లిక్కర్ స్కేల్ లో రికార్డు…డిసెంబర్ నెలలో రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు
ఏపీలో మద్యం ధరలు తగ్గడం, బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.124.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. కొత్త ఏడాదికి వెల్‌కం పలుకుతూ మొత్తంగా 1.36 లక్షల ఐఎంఎల్ లిక్కర్.. 53 వేలకు పైగా బీర్ కేసులు తాగేశారు. సాధారణ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఖజానాకు రూ.70-75 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. డిసెంబర్ 31 రోజు రూ.124 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే సాధారణ రోజులతో పోల్చుకుంటే రూ.50 కోట్ల మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి.
చదవండి : Premium Brand Liquor : ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం న్యూఇయర్ గిఫ్ట్.. అందుబాటులోకి..
30వ తేదీనే రూ. 121 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేయగా.. 30, 31వ తేదీల్లో రూ. 215 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేసింది ఎక్సైజ్ శాఖ.. కానీ, సరఫరా చేసిన మొత్తం మద్యాన్ని ఖాళీ చేశారు మందుబాబులు.. చివరకు కొన్ని షాపుల ముందు ఏంటీ బోర్డ్ పెట్టాల్సి వచ్చింది. మొత్తానికి కొత్త ఏడాది ఏపీ ఖజానాకు కాసులు కురిపించిందని చెప్పక తప్పదు.