Mithali Raj: కెప్టెన్సీలో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం బెలిండా క్లార్క్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి

Mithali Raj: కెప్టెన్సీలో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

Mithali Raj

Mithali Raj: ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం బెలిండా క్లార్క్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి రికార్డు సృష్టించాడు.

బెలిండా ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించి 23 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించాడు. సెడన్ పార్క్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఆ రికార్డ్ బ్రేక్ చేసి 24 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించారు.

‘మిథాలీ రాజ్ ఐషీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో అత్యధిక మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించాడు’ అని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. టోర్నమెంట్ ఆరంభంలోనే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఆరు ఎడిషన్లలో కనిపించిన తొలి క్రికెటర్ గా నిలిచింది. అలా సచిన్ టెండూల్కర్, జావేది మియాందాద్ లతో పాటు ఘనత దక్కించుకుంది.

Read Also: మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ 2022

23 మ్యాచ్‌లలో బెలిండ్ 14 గెలిచి 8 ఓటమికి గురికాగా ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండాపోయింది. ఆమె కెప్టెన్సీలో 1997, 2005 రెండు సార్లు వరల్డ్ కప్ ట్రోఫీ కూడా సాధించింది. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆ రెండు సీజన్లలోనూ బెలిండా కెప్టెన్సీ వహించిన సమయంలో మిథాలీ కూడా ఇండియా జట్టుకు కెప్టెన్సీ వహించారు.