Modi Live Updates: భగవద్ రామానుజుల విగ్రహాన్ని లోకానికి అంకితం చేసిన ప్రధాని- లైవ్ అప్ డేట్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. హైదరాబాద్ లోని ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన వెంటనే.. ముచ్చింతల్ లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు.

Modi Ff
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న రామానుజ జీయర్ స్వామివారి ఆశ్రమం దివ్య సాకేతంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకకు హాజరయ్యారు. విష్వక్సేన ఇష్టి యాగంలో పాల్గొన్నారు. అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం.. సమతామూర్తి.. భగవద్ రామానుజుల విగ్రహ ప్రాంగణానికి చేరుకున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల నమూనా ఆలయాలను సందర్శించారు. భగవద్ రామానుజుల విగ్రహాన్ని లోకానికి అర్పితం చేశారు. అంతకుముందు.. హైదరాబాద్ లోని ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఇక్రిశాట్ సేవలు కొనియాడారు. రైతులకు అండగా కేంద్రం తీసుకుంటున్న చర్యలను తన ప్రసంగంలో వివరించారు.