IPL2023: 4 నిమిషాల స‌మ‌యం వృధా.. మ్యాచ్ రిఫ‌రీ సీరియ‌స్‌.. ఐపీఎల్ ఫైన‌ల్ ఆడ‌కుండా ధోని పై నిషేదం ప‌డ‌నుందా..?

ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుతంగా ఆడుతూ ఫైన‌ల్‌కు చేరుకుంది. అయితే.. ఫైన‌ల్‌ మ్యాచ్‌కు ముందు చెన్నై జ‌ట్టుకు పెద్ద షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది.

IPL2023: 4 నిమిషాల స‌మ‌యం వృధా.. మ్యాచ్ రిఫ‌రీ సీరియ‌స్‌.. ఐపీఎల్ ఫైన‌ల్ ఆడ‌కుండా ధోని పై నిషేదం ప‌డ‌నుందా..?

MS Dhoni

MS Dhoni: ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుతంగా ఆడుతూ ఫైన‌ల్‌కు చేరుకుంది. మే 28న అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫ‌య‌ర్ 2 విజేత‌తో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. ఫైన‌ల్‌ మ్యాచ్‌కు ముందు చెన్నై జ‌ట్టుకు పెద్ద షాక్ త‌గిలే అవ‌కాశం ఉంది. ఆ జ‌ట్టు కెప్టెన్ ఎంఎస్‌ ధోని(MS Dhoni) ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌కుండా నిషేదం ప‌డే ఛాన్స్ ఉంద‌ని క్రికెట్ వ‌ర్గాలు అంటున్నాయి.

క్వాలిఫ‌య‌ర్ 1లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హేంద్రుడు అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో నాలుగు నిమిషాల విలువైన స‌మ‌యాన్ని వృథా చేశాడు. ఈ విష‌యాన్ని మ్యాచ్ రిఫ‌రీ సీరియ‌స్‌గా తీసుకున్నాడ‌ని స‌మాచారం. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫైన్ లేదా మ్యాచ్ నిషేదం ప‌డే అవ‌కాశం ఉందని జాతీయ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అటు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విష‌యంపై ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది.

ఒక‌వేళ కెప్టెన్ కూల్‌పై మ్యాచ్ నిషేదం ప‌డితే అది వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తుంది. దీంతో ధోని ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు వీలు లేకుండా పోతుంది. ఇది చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. అయితే.. మ్యాచ్ నిషేదం విధించాలా లేదా ఫైన్‌తో స‌రిపెట్టాలా అన్న‌ది పూర్తిగా మ్యాచ్ రిఫ‌రీ పై ఆధార‌ప‌డి ఉంటుంది.

MS Dhoni: ధోని గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే.. ఢిల్లీ ఆట‌గాళ్లు ఇలా అన్నారేంటి..?

ఏం జ‌రిగిందంటే..?

గుజ‌రాత్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా 16వ ఓవ‌ర్‌ను వేసేందుకు చెన్నై బౌల‌ర్ మ‌తీషా ప‌తిర‌ణ సిద్దం అవుతున్నాడు. అయితే.. ప‌తిర‌ణ బౌలింగ్ చేసేందుకు ఫీల్డ్ అంపైర్లు అంగీక‌రించ‌లేదు. ఎందుకంటే అంత‌క‌ముందు దాదాపు 9 నిమిషాల పాటు ప‌తిర‌ణ గ్రౌండ్‌లో లేదు. డ‌గౌట్ నుంచి వ‌చ్చి క‌నీసం ఒక్క బంతి కూడా ఫీల్డింగ్ చేయ‌కుండా బౌలింగ్ వేయ‌డానికి సిద్దం కావ‌డంతో అంపైర్లు అత‌డిని అడ్డుకున్నారు.

గ‌మ‌నించిన చెన్నైకెప్టెన్ ధోని వెంట‌నే అంపైర్ల వ‌ద్ద‌కు వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపు 4 నిమిషాల పాటు ఈ విష‌యమై చ‌ర్చ జ‌రిగింది. చివ‌ర‌కు అంపైర్లు అంగీక‌రించ‌డంతో మ‌తీషా ప‌తిర‌ణ బౌలింగ్ వేశాడు. వాస్త‌వానికి ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ ఆట‌గాడు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ స‌మ‌యం గ్రౌండ్‌లో లేక‌పోతే అంపైర్లు చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంది.

MS Dhoni: ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ధోని ఆడుతాడా..? లేదా..?.. సీఎస్‌కే సీఈఓ స‌మాధానం ఇదే