MS Dhoni: ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ధోని ఆడుతాడా..? లేదా..?.. సీఎస్‌కే సీఈఓ స‌మాధానం ఇదే

మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. కేవ‌లం ఐపీఎల్‌(IPL) మాత్ర‌మే ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలో చెన్నై సీఈఓ కాశీ విశ్వ‌నాథ‌న్ మాట్టాడుతూ ముఖ్య‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు.

MS Dhoni: ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ధోని ఆడుతాడా..? లేదా..?.. సీఎస్‌కే సీఈఓ స‌మాధానం ఇదే

CSK CEO predicts MS Dhoni's future

MS Dhoni Retirement: మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. కేవ‌లం ఐపీఎల్‌(IPL) మాత్ర‌మే ఆడుతున్నాడు. అయిన‌ప్ప‌టికీ ధోని క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక మ‌హేంద్రుడికి ఇదే చివ‌రి సీజ‌న్ అన్న‌ వార్త‌లు వినిపిస్తున్నాయి. ధోని కాద‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఊహాగానాలు ఆగ‌డం లేదు. ఎందుకంటే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు కూడా ధోని ఎలాంటి ముంద‌స్తు సూచ‌న లేకుండా వీడ్కోలు ప‌ల‌క‌డ‌మే ఇందుకు కార‌ణం.

ఈ క్ర‌మంలో ధోని ఎక్క‌డ మ్యాచ్ ఆడినా అక్క‌డ ప‌సుపు వ‌ర్ణంగా మారిపోతుంది. ధోని నామ‌స్మ‌ర‌ణతో చెన్నై ఆడే మ్యాచ్‌లు మారుమోగిపోతున్నాయి. ఇక ఆదివారం చెపాక్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. అయిన‌ప్ప‌టికి అభిమానులు నిరాశ‌కు గురి కాకుండా మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ సీజ‌న్‌లో లీగ్ ద‌శలో సీఎస్‌కే హోం గ్రౌండ్‌లో ఇదే చివ‌రి మ్యాచ్ కావడం కావ‌డంతో మ్యాచ్ అనంత‌రం ధోనితో స‌హా సీఎస్‌కే ఆట‌గాళ్లు మైదానం మొత్తం తిరిగారు.

MS Dhoni: ధోని గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే.. ఢిల్లీ ఆట‌గాళ్లు ఇలా అన్నారేంటి..?

టెన్నిస్ బంతుల‌ను, సీఎస్‌కే జెర్సీల‌ను మైదానంలోని అభిమానుల కోసం ధోని విసిరివేశాడు. అలాగే దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ సైతం ధోని వద్ద‌కు వ‌చ్చి అత‌డి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. దీంతో ఈ సీజ‌నే ధోనికి ఆఖ‌రిది అనే వాద‌న‌కు బ‌లం చేకూరింది. ఆట‌గాళ్లు అభిమానులకు ధ‌న్య‌వాదాల‌ను తెలుపుతున్న వీడియోను చెన్నైసూప‌ర్ కింగ్స్‌ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వీడియో ఆఖ‌ర్లో చెన్నై సీఈఓ కాశీ విశ్వ‌నాథ‌న్ మాట్టాడుతూ ముఖ్య‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు. వ‌చ్చే సీజ‌న్‌(ఐపీఎల్ 2024) సీజ‌న్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ఆడుతాడు అనే న‌మ్మ‌కం త‌న‌కు ఉన్న‌ట్లు చెప్పాడు. అభిమానులు ఇలాగే ఎల్ల‌వేళ‌లా జ‌ట్టుకు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కోరాడు.

MS Dhoni: ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గ‌జ ఆట‌గాడు.. చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు

ఈ సీజ‌న్‌లో చెన్నై ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా ఐదింటిలో ఓడిపోయింది. ఓ మ్యాచ్ ర‌ద్దుకావ‌డంతో 15 పాయింట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఆఖ‌రి మ్యాచ్‌ను మే 20 శ‌నివారం ఢిల్లీతో ఆడ‌నుంది. ఒక‌వేళ చెన్నై టాప్‌-2 స్థానాల్లో నిలిస్తే తొలి క్వాలిఫ‌యిర్‌ను చెన్నైలోనే ఆడే అవ‌కాశం ఉంది. మూడు నాలుగు స్థానాల్లో నిలిచినా ఎలిమినేట‌ర్ సైతం చెపాక్‌లోనే ఆడొచ్చు. రెండో క్వాలిఫ‌య‌ర్, ఫైన‌ల్ మ్యాచ్‌లు మాత్రం అహ్మ‌దాబాద్‌లోని మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి.

మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న ధోని

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్ ప్రారంభం నుంచి ధోని మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అందుక‌నే చివ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌స్తున్నాడు. వికెట్ల మ‌ధ్య ఎక్కువ‌గా ప‌రుగులు తీయ‌కుండా భారీ షాట్లు ఆడేందుకే య‌త్నిస్తున్నాడు. కొన్ని మ్యాచుల్లో సిక్స‌ర్ల‌తో అభిమానుల‌ను అల‌రించాడు.