One-year-old girl rescued: ముంబై నుంచి తెలంగాణకు ఏడాది పాపను తరలించాలనుకున్న ముఠా.. అరెస్టు

పిల్లల అక్రమ రవాణా ముఠా నుంచి ఏడాది వయసున్న ఓ పాపను పోలీసులు కాపాడారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రూజ్ లో నాలుగు రోజుల క్రితం ఓ పాప కిడ్నాప్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆ పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ పాపను ఇద్దరు మహిళలు తెలంగాణకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారని, అక్కడ పాపను అమ్మాలనుకుంటున్నారని తెలుసుకున్న పోలీసులు వారిని సోలాపూర్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు.

One-year-old girl rescued: ముంబై నుంచి తెలంగాణకు ఏడాది పాపను తరలించాలనుకున్న ముఠా.. అరెస్టు

Delhi Women Pick Pockets Arrested

One-year-old girl rescued: పిల్లల అక్రమ రవాణా ముఠా నుంచి ఏడాది వయసున్న ఓ పాపను పోలీసులు కాపాడారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రూజ్ లో నాలుగు రోజుల క్రితం ఓ పాప కిడ్నాప్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆ పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆ పాపను ఇద్దరు మహిళలు తెలంగాణకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారని, అక్కడ పాపను అమ్మాలనుకుంటున్నారని తెలుసుకున్న పోలీసులు వారిని సోలాపూర్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. అనంతరం ఆ ఇద్దరు మహిళలను పోలీసులు విచారించగా అక్టోబరు 30న ఆ పాపను అపహరించామని, ఆ పాపను అమ్మడానికి తెలంగాణకు తీసుకెళ్దామనుకున్నామని చెప్పారు.

ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ తో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కలిసి పిల్లల అక్రమ రవాణా ముఠా ఆటకట్టించామని అధికారులు తెలిపారు. తమకు చిక్కిన ఆ ఇద్దరు మహిళలు ముంబైలోని నెహ్రూ నగర్ కి చెందిన వారని చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నామని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..