Murali Mohan : పవన్ కళ్యాణ్ సీఎం అయితే గర్విస్తాను.. టీడీపీ నేత, సీనియర్ నటుడు వ్యాఖ్యలు..

ఇటీవల మురళీమోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ''చాలా మంది పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి తమ వల్ల కాకపోతే మధ్యలోనే వదిలేస్తారు. కానీ పవన్......

Murali Mohan : పవన్ కళ్యాణ్ సీఎం అయితే గర్విస్తాను.. టీడీపీ నేత, సీనియర్ నటుడు వ్యాఖ్యలు..

Murali Mohan

Updated On : July 17, 2022 / 2:43 PM IST

Pawan Kalyan :  ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సీరియస్ గా ఏపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ సీఎం కావాలని ఆయన అభిమానులతో పాటు చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో, టాలీవుడ్ లో చర్చగా మారాయి. మురళీమోహన్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ పవన్ సీఎం అయితే గర్విస్తాను అని చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కృతి శెట్టి గురించి మీకు తెలియని విషయాలు

ఇటీవల మురళీమోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ”చాలా మంది పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి తమ వల్ల కాకపోతే మధ్యలోనే వదిలేస్తారు. కానీ పవన్ విషయంలో మాత్రం అలాంటిది జరిగే ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్‌లో నాకు నచ్చే అంశం కూడా అదే. పార్టీని, ప్రజలని నమ్మి పవన్ పని చేస్తున్నారు. కార్యకర్తలు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతూ పవన్ ముందుకెళ్తారు. ఇదే పట్టుదలతో కొనసాగితే పవన్ గొప్ప స్థానానికి కచ్చితంగా వెళ్తాడు. చిరంజీవితో ఉన్న క్లోజ్‌‌నెస్ నాకు పవన్ తో లేదు. పవన్ ఎప్పుడూ తన పని తాను చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా చెప్పలేను కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను కచ్చితంగా గర్వపడతాను. పవన్ సీఎం అయితే మా సినిమా వాళ్ల నుంచి మరొకరు ముఖ్యమంత్రి పదవి సాధించారని సంతోషపడతాను” అని తెలిపారు. దీంతో మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.